నాటు పందుల్లో వరుస మరణాలు.. అంతుచిక్కని వ్యాధి??

తెలుగు రాష్ట్రాల్లో పందుల పెంపకం( Pigs ) బాగా పెరిగిపోయింది.పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు వరాహాలను పెంచుతున్నారు.

 Rare Disease Attack On Pigs Dying Tirupati Details, Pigs, Pigs Dying, Tirumala P-TeluguStop.com

ఆలయాల శివారులలో ఇవి ఎక్కువగా కనిపిస్తోంది.అయితే కొంతకాలం నుంచి అంతుచిక్కని వ్యాధితో పందులు మరణిస్తున్నాయి.

నీటిలోకి వెళ్లగానే పందులు మృత్యువాత.

వివరాల్లోకి వెళ్తే.

తిరుపతి శివారు ప్రాంతాల్లో( Tirupati ) ఒక్కో కుటుంబం 50 నుంచి 100 పందులను పెంచుతున్నాయి.వాటిలో కొన్ని పందులు 90-110 కేజీల వరకు తూగుతున్నాయి.

ఇక మిగిలిన పందులు 70కేజీల లోపు ఉన్నాయి.ముగిలినవన్నీ పిల్లలు కాగా అవి కరెంటు తీగలకు తగిలి చాలా బలహీనమవుతున్నాయి.

పెద్దవి కూడా కరెంటు తీగలు తగలడం వల్ల నిరసించిపోయి నీటిలోకి వెళ్ళగానే చనిపోతున్నాయి.దాంతో పందులను పెంచే వారిలో ఆందోళన పెరిగిపోతోంది.

Telugu Classical Swine, Latest, Pig Farm, Pigs, Rare, Telugu, Tirumala Pigs, Tir

ఒక్కో పంది రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతోంది.ఇంత తరగల పందులు చనిపోతుంటే ఒక్కో కుటుంబానికి 5 నుంచి 7 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది.

దీంతో వారందరూ కన్నీరు పెట్టుకుంటున్నారు.ఈ విషయంలో స్పందించిన శాస్త్రవేత్తలు “క్లాసికల్ స్వైన్ ఫీవర్” ( Classical Swine Fever ) అనే వ్యాధి పందుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపారు.

నార్త్ ఇండియాలో ఈ వ్యాధి మొదటగా వెలుగు చూసింది తర్వాత దక్షిణ భారతదేశంలోనూ వ్యాధి పందులను కబలించేస్తోంది.

Telugu Classical Swine, Latest, Pig Farm, Pigs, Rare, Telugu, Tirumala Pigs, Tir

వ్యాధి వస్తే ఎక్కువగా నాటు పందులే మరణిస్తాయి.ఈ వ్యాధి ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కనుగొనబడింది.ఈ వ్యాధితో రాజమండ్రిలో 80 శాతం పందులు కన్ను మూసాయి.

పందుల రక్తాలను పరీక్షించగా ఈ వ్యాధి నిర్ధారణ అయింది.క్లాసికల్ స్వైన్ ఫీవర్ వచ్చిన పందులలో చెవుల కింద, తొడల కింది భాగంలో, చర్మంపై వంకాయ రంగు మచ్చలు కనిపిస్తాయి.

జ్వరం వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వాటిని తీసుకెళ్లడం మంచిది.

డాక్టర్లు ఈ వ్యాధిని నిరోధించడానికి టీకా ఇస్తారు.

మూడు నెలల నిండిన పందులకు మాత్రమే ఈ టీకా పని చేస్తుంది.ఒక్కో టీకా కేవలం 20 రూపాయలు మాత్రమే కావడం వల్ల పంది పెంపకదారులపై ఎక్కువగా భారం పడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube