మ్యూజిక్ సిట్టింగ్స్ లో దేవి అండ్ టీమ్.. ఈసారి మరింత ఊగిపోవడం ఖాయమా..

పుష్ప 2.ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.

 Pushpa 2 Music Work Started, Allu Arjun, Pushpa 2, Sukumar, Rahsmika Mandanna,de-TeluguStop.com

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ పార్ట్ 2 కోసం మరింత ఎక్కువుగా ఖర్చు చేస్తున్నారు.

సుకుమార్ పార్ట్ 2 స్క్రిప్ట్ పైన చాలా రోజులు వర్క్ చేసారు.ఫైనల్ గా రెండు నెలల క్రితం ఈ సినిమా సీక్వెల్ షూట్ అధికారికంగా స్టార్ట్ చేసినట్టు తెలిపారు.

ఈసారి ఇండియన్ ఫారెస్ట్ లతో పాటు ఫారిన్ లొకేషన్స్ ను కూడా సుకుమార్ చూసినట్టు టాక్.ఈసారి అల్లు అర్జున్ ను రిచ్ లుక్ లో డిజైన్ చేయగా.

ఈయన ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ డాన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా అటు శరవేగంగా షూట్ జరుపుకుంటూనే ఇటు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్ చెన్నై లోని రికార్డింగ్ థియేటర్ లో స్టార్ట్ అయ్యిందట.దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్ ఇద్దరు కూడా ఈ మ్యూజిక్ సిట్టింగ్ లో పాల్గొన్నారని త్వరలోనే అల్లు అర్జున్ కూడా పాల్గొంటాడు అని టాక్.

దీంతో ఈసారి ఫ్యాన్స్ మరింత ఊగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

పార్ట్ 1 లో సాంగ్స్ కారణంగానే ఈ సినిమాకు అంత హైప్ వచ్చింది అనే చెప్పాలి.గత ఏడాది మొత్తం ఈ సినిమా సాంగ్స్ నెట్టింట టాప్ ట్రెండింగ్ గా నిలిచాయి.అందుకే ఈసారి కూడా అంతకు మించి ఉండేలా సాంగ్స్ ను దేవి శ్రీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 నుండి ఫస్ట్ లుక్ టీజర్ లేదా గ్లిమ్స్ ను ఇచ్చే ప్రయత్నం కూడా సుక్కూ చేస్తున్నట్టు టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube