భారతీయ జనతా పార్టీఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన రాణి రుద్రమ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) గంభీరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయం మండల అధ్యక్షులు గంట అశోక్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ ప్రారంభించారు.

అనంతరం రాణి రుద్రమ( Rani rudrama ) మాట్లాడుతూ వచ్చే శాసనసభ ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడాలన్నారు.

కుటుంబ వారసత్వంనీ ఆసరాగా చేసుకొని గెలిచి కేవలం వారి బంధుమిత్రుల చేతిలో పెట్టి నియోజకవర్గంని పెట్టిన కేటీఆర్ ను గద్దె దించి భారతీయ జనతా పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.బిజెపి కార్యకర్తలకు సంక్షేమ పథకాలు రాకుండా చేయడం సరికాదన్నారు.

కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ఆడెపు రవీందర్, అశోక్, ప్రసాద్ రెడ్డి,దేవసాని కృష్ణ, రాజు గౌడ్, మహేష్, అన్ని శాఖల మోర్చా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని అమ్మి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..
Advertisement

Latest Rajanna Sircilla News