టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, మహానటి ఫెమ్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో తొలిసారిగా తెరకెక్కనున్న సినిమా ‘రంగ్ దే’.ఇక ఈ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతుంది.
సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ నిర్మాణంలో పివిడి ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న విడుదల కానుంది.
తాజాగా శుక్రవారం రోజున ఈ సినిమా ట్రైలర్ ను సినీ బృందం విడుదల చేసింది.ఇక ఈ సినిమా ట్రైలర్ ను చూసినట్లయితే హీరోని హీరోయిన్ తొక్కేసినట్లు కనిపించింది.
అంతేకాకుండా కామెడీ, లవ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా కనిపించింది.చిన్నప్పటి నుంచి హీరో ని తొక్కడం స్టార్ట్ చేస్తుంది హీరోయిన్.
అంతే కాకుండా ఇందులో కీర్తి సురేష్ మాటలు ఎంతో ఆకట్టుకోగా.ట్రైలర్ మొత్తం సరదా సరదాగా కనిపించింది.
వీరిమధ్య రొమాన్స్ కూడా ఉండగా అది పెద్ద హైలెట్ గా మారింది.చివరిలో కాస్త ఎమోషనల్ గా ఉన్న సన్నివేశాలు చూస్తే సినిమా మాత్రం పక్క హిట్ ను అందిస్తుందని నమ్మకం కనబడుతుంది.

మొత్తానికి డిఫరెంట్ స్టైల్ , కథతో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ట్రైలర్ విడుదలైన కాసేపట్లోనే విపరీతమైన లైకులు వచ్చాయి.ఇక ఈ సినిమా కంటే ముందు నితిన్ నటించిన సినిమా కు అంత విజయం రాకపోయేసరికి ఈ సినిమా నుంచి మంచి హిట్ ని సాధిస్తాడనే అర్థమవుతుంది.
ఇక కీర్తి సురేష్ కూడా వరుస ఆఫర్ లతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది.దీంతో కీర్తిసురేష్ ఖాతాలో ఈ సినిమా ద్వారా మరో విజయం పడనుంది.