కర్వా చౌత్ వేడుకలలో రానా భార్య మిహీక... ప్రేమ బలపడుతుందంటూ పోస్ట్?

రానా దగ్గుబాటి 2020లో కరోనా సమయంలో తను ప్రేమించిన అమ్మాయి మిహికా బజాజ్‌ (Miheeka Bajaj) ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

మిహీక నార్త్ ఇండియాకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు సాంప్రదాయాలను ఎంతో చక్కగా పాటిస్తూ ఉంటారు.

ఇక సోషల్ మీడియాలో కూడా మిహీక చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కానప్పటికీ అందం విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరని చెప్పాలి.

బిజినెస్ ఉమెన్ గా ఎంతో బిజీగా ఉండే మిహీక ఎప్పటికప్పుడు తన భర్త రానా(Rana ) పై తనకున్నటువంటి ప్రేమను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఇక ఈమె నార్త్ ఇండియాకు(North Indian) చెందిన అమ్మాయి కావడంతో ఇటీవల కర్వాచౌత్ (Karva chauth) వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.పెళ్లయిన మహిళలు తమ భర్త క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వేడుకను జరుపుకుంటారు.ఎంతో సాంప్రదాయబద్ధంగా గోరింటాకు పెట్టుకొని ఆరోజు మొత్తం ఉపవాసం ఉంటూ సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత జల్లెడలో తన భర్త మొహం చూసి అనంతరం ఉపవాసాన్ని విరమిస్తారు.

Advertisement

ఇలా చేయటం వల్ల తమ భర్త క్షేమంగా ఉంటారని భావిస్తారు.

ఇక మిహీక కూడా నార్త్ ఇండియాకు చెందిన అమ్మాయి కావడంతో ఈమె కూడా సాంప్రదాయంగా చీర కట్టుకొని రెడీ ఆయన ఫోటోని షేర్ చేసి.అదే చంద్రుడు కింద ప్రతి సంవత్సరం ప్రేమ ఇంకా బలపడుతుంది అంటూ రానా దగ్గుబాటిని ట్యాగ్ చేసి హ్యాపీ కర్వాచౌత్ అని చెప్పింది.దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే కేవలం మిహీక ఒక్కతే ఉన్న ఫోటోని షేర్ చేయడంతో అభిమానులు ఈ ఫోటోపై కామెంట్ చేస్తూ రానాతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.బహుశా రానా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల అందుబాటులో లేరని మరికొందరు భావిస్తున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు