ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయినా ఆ విషయంలో ఫెయిల్.. రానా కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు హీరో నటుడు రానా( Rana Dagguabati ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రానా కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరించారు.

అయితే రానా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.ఇన్నేళ్ల కాలంలో ఎన్నో సినిమాలలో నటించడంతోపాటు నిర్మాతగా కూడా పలు సినిమాలను తెరకెక్కించారు.

ఇక రా నాకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా అంటే బాహుబలి అని చెప్పవచ్చు.ఈ సినిమాలో విధంగా బల్లాల దేవా క్యారెక్టర్ లో జీవించి నటించారు రానా.

ఈ మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

Advertisement

ఇది ఇలా ఉంటే కేన్స్‌ చలన చిత్రోత్సవంలో చరిత్ర సృష్టించిన ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ ఇండియా డిస్ట్రిబ్యూషన్‌( All We Imagine As Light ) హక్కులను రానా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది.ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆసియా పసిఫిక్‌ స్క్రీన్‌ పురస్కారాల్లో ఐదు నామినేషన్లు దక్కించుకుంది.

నవంబర్‌ 30న ఆస్ట్రేలియాలో ఈ పురస్కారాల వేడుక జరగనుంది.ఈ సందర్భంగా రానా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.

నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు గడిచాయి.ఇప్పటికీ ప్రేక్షకులు ఎలాంటి చిత్రాలను ఇష్టపడతారో తెలుసుకోవడంలో విఫలం అవుతున్నాను.

గేమ్ ఛేంజర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా.. అందుకే రిజెక్ట్ చేశారా?
ఈ స్టార్ డైరెక్టర్లు ఇప్పటికైన మారాల్సిన అవసరం ఉందా..?

పెద్ద హీరోల చిత్రాలే కాదు.కథ, భావోద్వేగంతో నిండిన ప్రతీ చిత్రం కూడా ప్రత్యేకతను చాటుకుంటుందని అర్థమైంది.

Advertisement

2004లో వచ్చిన బొమ్మలాట( Bommalata ) అనే యానిమేషన్‌ చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరించాను.దానికి జాతీయ అవార్డు వచ్చింది.ఆ సినిమా థియేటర్లో విడుదల కాలేదు.దాని విడుదల కోసం మేం థియేటర్లు వెతుక్కోవాల్సి వచ్చింది.

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో లాగా ఇక్కడ చిత్ర నిర్మాతలకు గ్రాంట్లు ఉండవు.సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా హిట్‌ చేస్తారు అని తెలిపారు రానా.

తాజా వార్తలు