Venkatesh: ఒక్క సిరీస్ తో మూడు దశాబ్దాల వెంకీ పరువు ఢమాల్

35 ఏళ్లుగా సినిమా ఫీల్డ్ లో ఉంది, 62 ఏళ్ళ వయసు ఉన్న వెంకటేష్ కి(Venkatesh) ఒక్కసారిగా ఏమైంది అని అయన అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.చాల రోజులుగా ఇండస్ట్రీ లో ఒక్క వెంకీ మాత్రమే తన వయసుకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు అని అందరి హీరోలకు ఒక ఉదాహరణ వేలెత్తి చూపాం.

 Rana Naidu Negative Feed Back To Venkatesh-TeluguStop.com

కానీ ఒకే ఒక్క సిరీస్ తో ఇన్నేళ్ళుగా తాను కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం పోయింది.అదే రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్.

అన్న కొడుకు రానా తాను కలిసి చేసిన ఈ సిరీస్ లో లెక్కలేనన్ని భూతులు ఉన్నాయ్.

మూడు దశాబ్దాలుగా ఎంతో మంది మహిళా అభిమానులను సంపాదించుకున్న ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇంత దారుణమైన భూతు పదాలను ఎలా ఎంకరేజ్ చేసాడో అర్ధం కాలేదు.

పైగా ఇందులో కొడుకు పాత్రలో రానా నటించాడు.రానా(Rana Daggubati) సంగతి కాసేపు పక్కన పెడితే వెంకీ కి ఉన్నపళంగా ఇలాంటి ఒక భూతు సిరీస్ చేయాల్సిన అవసరం ఏమచ్చిందో అర్ధం కావడం లేదు.

సిరీస్ విడుదల అవ్వగానే వెంకటేష్, రానా పై ఉన్న సదభిప్రాయం తో మంచి గా రివ్యూ లు ఇచ్చిన సగటు వెంకటేష్ అభిమానులకు మాత్రం ఇది ఎక్కకపోవచ్చు.

Telugu Venkatesh, Rana Daggubati, Rana, Rana Web, Venkatesh Fans, Venkatesh Rana

ఇక ఆ బాషా ప్రయోగం మరి దారుణం.కుటుంబం తో కలిసి ఈ సిరీస్ ని చూడటం జరిగే పని కాదు.ఇప్పటికే టాలీవుడ్ లో అన్ని సినిమాలను తెలుగు లో తీసి పాన్ ఇండియా పేరు తో హిందీ లో వదులుతున్నారు.

కానీ ఈ సిరీస్ విషయానికి వస్తే హిందీ లో తీసి తెలుగు లో విడుదల చేసినట్టుగా అనిపించింది.హిందీ మార్కెట్ ని గ్రాబ్ చేయాలంటే ఒక్క సిరీస్ తో ఏమైపోతుంది.

కావాలంటే డబ్బులకు కొదవేముంది.

Telugu Venkatesh, Rana Daggubati, Rana, Rana Web, Venkatesh Fans, Venkatesh Rana

మంచి సినిమా తీయచ్చు కదా.రే డోనోవన్ అనే ఇంగ్లీష్ సిరీస్ కి ఇది ఆఫీసియల్ రీమేక్ గా తెలుస్తుంది.దీనికి రెండో సీజన్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక ప్రమోషన్ ఇంటర్వ్యూ లు ఇస్తున్న రానా, వెంకీ ఏకంగా మా సిరీస్ ని చూడద్దు అని కూడా చెప్తున్నారు.ఏంటో కానీ మొత్తంగా ఈ సిరీస్ ద్వారా రానాకు పోయేది లేదా వచ్చేది ఏమి లేదు.

కానీ వెంకటేష్ కి మాత్రం జనాల ఛీత్కారం దక్కుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube