ఈ ఏడాదిలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న రానా నాయుడు.. బూతు సిరీస్ అంటూనే చూశారుగా?

రానా (Rana), వెంకటేశ్‌ (Venkatesh) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu)రిలీజైనప్పుడు ఎన్ని విమర్శలు వచ్చాయో, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ వెబ్ సిరీస్ కి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సిరీస్ ద్వారా మొట్టమొదటిసారి వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సిరీస్ ప్రారంభమైనటువంటి కొంత సమయానికి ఇందులో డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండడంతో వెంకటేష్ పట్ల పూర్తిస్థాయిలో విమర్శలు వచ్చాయి.

గత మూడు దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆయన ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది.

ఇక ఈ వెబ్ సిరీస్ గురించి పలువృత్తిని సెలెబ్రిటీలు కూడా విమర్శలు కురిపించడంతో తెలుగులో దీనిని తీసేశారు.కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ వెబ్ సిరీస్ కు విపరీతమైనటువంటి ఆదరణ లభించింది.నెట్ ఫ్లిక్స్(N et Flix) లో విడుదలైనటువంటి ఈ సిరీస్ విడుదలకు ముందు ఫ్యామిలీతో కలిసి చూడద్దంటూ ముందుగానే చెప్పారు.అయితే ఇలా చెప్పడం ఈ సిరీస్ కి బాగా కలిసి వచ్చిందని తెలుస్తోంది.2023 జనవరి నుంచి జూన్‌ వరకు ఎక్కువ వ్యూస్‌ వచ్చిన వాటి వివరాలను నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది.

Advertisement

ఈ విధంగా ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా సాధించినటువంటి సీరియస్ లలో రానా నాయుడు సీరియస్ మొదటి స్థానంలో ఉండటం విశేషం.వ్యూస్‌ ఆధారంగా సుమారు 18వేల టైటిల్స్‌ డేటాను పరిశీలించి, గ్లోబల్‌గా ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న టాప్‌ 400ను విడుదల చేసింది.ఇందులో ‘రానా నాయుడు’ టాప్‌ 336లో నిలిచింది.

  మన ఇండియా నుంచి వచ్చినటువంటి వెబ్ సిరీస్ లలో ఈ సిరీస్ ఒక్కటే 400లో స్థానం దక్కించుకుంది.దీన్ని 46 మిలియన్ల గంటలు చూసినట్లు ఆ సంస్థ తెలిపింది.రానా నాయుడు వెబ్ సిరీస్ కు 1.64 కోట్ల వ్యూయింగ్ హవర్స్ నమోదయ్యాయి. ఇక ఈ విషయాలను వెల్లడించడంతో బూత్ సిరీస్ అంటూనే భారీ స్థాయిలో ఈ సిరీస్ చూశారని స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement

తాజా వార్తలు