టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి బాహుబలి సినిమాతో ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే.ఆ సనిమాలో రానా యాక్టింగ్‌కు జనం బాగా ఇంప్రెస్ అయ్యారు.
అటుపై చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ అలరిస్తు్న్నాడు.కాగా రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
వేణు ఉడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఇందులో రానా ముఖానికి ఎర్రటి గుడ్డ కట్టుకుని చాలా ఇన్టెన్స్‌గా కనిపిస్తున్నాడు.బ్యాక్‌గ్రౌండ్‌లో తుపాకులతో గుంపుగా వస్తు్న్నట్లు చూపించారు.
తిరుగుబాటు కూడా ప్రేమలో ఒక భాగమే అనే క్యాప్షన్‌తో ఈ సినిమాలో రానా ఒక తిరుగుబాటు దారుడి పాత్రలో కనిపిస్తాడని, సింబాలిక్‌గా ఎరుపు గుడ్డ ముఖానికి చుట్టి మరీ చూపించారు చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమాలో రానా సరసన ఫిదా హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రానా బాబాయి వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.