ఫోటోటాక్: తిరుగుబాటు కూడా ప్రేమలో భాగమే అంటోన్న విరాట పర్వం

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి బాహుబలి సినిమాతో ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే.

ఆ సనిమాలో రానా యాక్టింగ్‌కు జనం బాగా ఇంప్రెస్ అయ్యారు.అటుపై చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ అలరిస్తు్న్నాడు.

కాగా రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

వేణు ఉడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ""img "aligncenter" Src="" / తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఇందులో రానా ముఖానికి ఎర్రటి గుడ్డ కట్టుకుని చాలా ఇన్టెన్స్‌గా కనిపిస్తున్నాడు.బ్యాక్‌గ్రౌండ్‌లో తుపాకులతో గుంపుగా వస్తు్న్నట్లు చూపించారు.

తిరుగుబాటు కూడా ప్రేమలో ఒక భాగమే అనే క్యాప్షన్‌తో ఈ సినిమాలో రానా ఒక తిరుగుబాటు దారుడి పాత్రలో కనిపిస్తాడని, సింబాలిక్‌గా ఎరుపు గుడ్డ ముఖానికి చుట్టి మరీ చూపించారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో రానా సరసన ఫిదా హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రానా బాబాయి వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.