ఇద్దరు హీరోలకు తల్లిగా శివగామి

ఒకప్పటి స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.కాగా బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ తన నటనతో ఆ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Ramya Krishnan To Play Mother Of Two Heroes-TeluguStop.com

శివగామి పాత్ర కేవలం రమ్యకృష్ణ తప్ప మరెవరూ చేయలేరనే వార్త ఇండస్ట్రీ జనాల్లో ఏర్పడిందంటే, ఆమె యాక్టింగ్ ఏ లెవెల్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ చేసిన సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు రాకపోయినా ఆమె సినిమాలో నటిస్తే ఆ సినిమాకే బలం చేకూరుతుందని చిత్ర యూనిట్ భావించింది.

ఈ క్రమంలో రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు కేరాఫ్‌గా మారింది.దీంతో యంగ్ హీరోలు అయిన విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్‌లకు తల్లి పాత్రలో నటించేందకు రెడీ అవుతోంది.

పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటిస్తుండగా, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న బాక్సార్ చిత్రంలో కూడా ఆమె తల్లిగా నటిస్తోంది.

మొత్తానికి రమ్యకృష్ణ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకోవడమే కాకుండా ఆసక్తికర పాత్రలను దక్కించుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటోంది.

మరి రాబోయే యంగ్ హీరోల చిత్రాలలో ఆమె ఎలాంటి పాత్రలు దక్కించుకుంటుందో, ఆ పాత్రలు ఆమెకు ఎంతమేర పేరు తీసుకొస్తాయా అని అందరూ ఆలోచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube