మరో చంద్రబాబును దించేసిన వర్మ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా కూడా కొత్తగా, వింతగా, చెత్తగా ఉంటుంది.

ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభించాడు.ఇలాంటి ప్రాజెక్ట్‌లను వర్మ ప్రకటించి వదిలేస్తాడని అంతా భావించారు.

కాని వర్మ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్‌ను షూటింగ్‌ వరకు తీసుకు వెళ్లాడు.అనుకున్నట్లుగానే ఈ చిత్రంలో కీలకమైన విలన్‌ పాత్రగా చంద్రబాబు నాయుడు పాత్రను చూపించబోతున్నట్లుగా తాజాగా ఆయన విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ చూస్తుంటేనే అర్థం అవుతుంది.

చంద్రబాబు నాయుడు పాత్రను ఇప్పటికే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో రచ్చ రచ్చ చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి చంద్రబాబు నాయుడు ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేలా వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వర్మ ఎందుకు చంద్రబాబు నాయుడుపై కక్ష కట్టాడో అర్థం కావడం లేదు అంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.తాజా చిత్రం కోసం ఒక నటుడిని చంద్రబాబు తరహాలో తయారు చేయడంతో వర్మ ప్రతిభను అంతా మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.

Advertisement

చంద్రబాబు నాయుడు పాత్రకు ఆ వ్యక్తి సరిగ్గా సరిపోయాడు.ఒక పాత్రకు తగ్గట్లుగా నటీనటులను ఎంపిక చేయడంలో రామ్‌ గోపాల్‌ తర్వాతే ఇండియాలో మరే దర్శకుడు అయినా అంటూ ఉన్న ఒక టాక్‌ మరోసారి దీంతో నిరూపితం అయ్యింది.

నేడు ఈ చిత్రంలోని చంద్రబాబు నాయుడు పాత్రధారి ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు.తాజాగా ఒక ఫొటోను విడుదల చేసి ఇతను ఎవరో చెప్పండి అంటూ వర్మ పెట్టిన ట్విస్ట్‌ అందరికి తెల్సిందే.

చంద్రబాబు నాయుడు లాగే తయారు చేసి ఇతను ఎవరు చెప్పండి అనడంలోనే అతడి పబ్లిసిటీ స్టంట్‌ దాగి ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు