ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి స్పందించి వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ గురించి స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయిన అరియానా గ్లోరీ ప్రస్తుతం బిగ్ బాస్ షోలో పాల్గొని స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా ఉన్నారు.
దీంతో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా అరియానాను సపోర్ట్ చేస్తూ ఆమెను విన్నర్ ను చేయాలని నెటిజన్లకు సూచిస్తున్నారు.
రామ్గ్ గోపాల్ వర్మకు ముంబాయిలోని బిగ్ బాస్ టీమ్ లతో సంబంధాలు ఉన్నాయని.
అందువల్లే అరియానా బిగ్ బాస్ షోకు ఎంపికైందని కూడా ప్రచారం జరుగుతోంది.అయితే తాజాగా వర్మ మరోమారు బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎవరికీ అర్థం కాని వర్మ తాను బిగ్ బాస్ షోను చూడనని.కానీ హిందీలో బిగ్ బాస్ షోకు సన్నీలియోన్ వచ్చిందని కొన్ని రోజులు మాత్రం ఆ షోను తాను చూశానని తెలిపారు.
బిగ్ బాస్ షో హోస్ట్ చేసే ఆఫర్ వచ్చినా తాను బిగ్ బాస్ హౌస్ కు వెళ్లనని కానీ పార్టిసిపెంట్ గా అవకాశం వస్తే మాత్రం వెళతానని తెలిపారు.బిగ్ బాస్ హౌస్ లోకి తనతో పాటు 16 మంది అమ్మాయిలను పంపిస్తే కచ్చితంగా వెళతానని హౌస్ లో ఎన్ని కెమెరాలు ఉన్నా తనకు అభ్యంతరం లేదని వర్మ అన్నారు.
నైట్ విజన్ కెమెరాలు ఉన్నా తాను పట్టించుకోనని బిగ్ బాస్ షో గురించి కామెంట్లు చేశారు.

వర్మ చేసిన కామెంట్లను చూసి నెటిజన్లు వర్మ అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదని కామెంట్లు చేస్తున్నారు.ఆరు పదుల వయస్సులో కూడా వర్మ 16 మంది అమ్మాయిలతో కలిసి బిగ్ బాస్ షోకు వెళతానని చెబుతుండటం గమనార్హం.







