యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”స్కంద”( Skanda ).ఈ సినిమాలో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ సినిమా హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
ఇక బోయపాటి( Boyapati ) అంటేనే ఫుల్ ఊర మాస్ కావడంతో యాక్షన్ ప్రేమికులంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

అందులోను బాలయ్యకు ‘అఖండ'( Akhanda ) వంటి బ్లాక్ బస్టర్ అందించిన బోయపాటి రామ్ కు కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో అని ఆయన ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలు డబుల్ చేసాయి.ఇటీవలే వచ్చిన ట్రైలర్ అంచనాలు పీక్స్ కు చేరుకునేలా చేసింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా ముందు అనుకున్న డేట్ కు రావడం లేదని అందరికి తెలుసు.
ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలని అనుకోగా ఇప్పుడు సలార్( Salaar ) వంటి భారీ మూవీ వాయిదా పడడంతో ఆ డేట్ కు స్కందను రిలీజ్ చేయబోతున్నారు.
సెప్టెంబర్ 28న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.మరి రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచేసారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఓవర్సీస్ డిటైల్స్( Skanda Movie overseas ) బయటకు వచ్చాయి.

ఈ సినిమాను సెప్టెంబర్ 27న ఓవర్సీస్ లో రిలీజ్ చేయనున్నారు.వర్ణిక విజువల్స్( Varnikha Visuals ) వారు ఓవర్సీస్ లో స్కంద సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.
ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.







