Skanda : అప్పుడే ఓటీటీలోకి.. బోయపాటి సినిమాను థియేటర్ లో నెల రోజులు కూడా ఆడించలేరా?

యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) దర్శకత్వంలో తాజాగా రామ్ హీరోగా నటించినటువంటి స్కంద సినిమా ( Skanda Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

భారీ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

శ్రీ లీల రామ్ హీరో హీరోయిన్లుగా తెరికెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేసింది.అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్ట లేకపోయింది.

ఇలా థియేటర్లో మిశ్రమ స్పందనతో కొనసాగుతున్నటువంటి ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి రాబోతోందని తెలుస్తుంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ( Disney+Hotstar ) కొనుగోలు చేశారు.ఇలా ఈ సినిమా హక్కులను దక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఈ సినిమా ఈనెల 27వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుందని తెలుస్తుంది.

ఇలా ఈ సినిమా విడుదల అయ్యి నెలరోజులు కూడా కాకుండానే ఇలా ఓటీటీ లోకి వస్తోందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

Advertisement

బోయపాటి లాంటి ఒక స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో రామ్( Ram Pothineni ) హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల( Sreeleela ) హీరోయిన్గా నటించారు.ఇలా భారీ తారాగణంతో తెరకెక్కినటువంటి ఈ సినిమా నెలరోజులు కూడా థియేటర్లో ఆడలేకపోవడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఈ సినిమా నెల రోజుల్లో కూడా థియేటర్లో ఆడకుండానే ఓటీటీలోకి రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఎంత విఫలమైందో స్పష్టంగా తెలుస్తుంది.

అక్టోబర్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్కంద సినిమా( Skanda Movie OTT Release ) ప్రసారం కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా అధికారక ప్రకటన మాత్రం తెలియచేయలేదు.అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలను డిస్నీ ప్లస్ హాట్స్టార్ అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు