'స్కంద' హిట్ అవుతుందా.. ట్విట్టర్ లో వీరి కామెంట్స్ చూస్తే..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”స్కంద( Skanda )”.ఈ సినిమాలో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించడంతో ఆడియెన్స్ అంత ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూసారు.

 Ram Pothineni Skanda Twitter Review, Ram Pothineni, Skanda, Skanda Twitter Revie-TeluguStop.com

మరి ఆ ఎదురు చూపులకు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడబోతోంది.

స్కంద సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సెప్టెంబర్ 28న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.మరి ఈ అంచనాల మధ్య ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ప్రీమియర్స్ కూడా పడ్డాయి.స్కంద ఫ్యాన్స్ ఈ సినిమా ప్రీమియర్స్ ను వీక్షించి వారి స్పందనను సోషల్ మీడియా వ్యాప్తంగా తెలిపారు.

ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు తమ రివ్యూలను తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.మరి వారి రివ్యూలను ఒక్కసారి పరిశీలిస్తే.ఈ సినిమా బాలయ్య అఖండ రేంజ్( Akhanda ) లో ఉందని ఒకరు ట్వీట్ చేయగా.మరొకరు ఈ సినిమా అదిరిపోయిందని చెప్పుకొచ్చారు.యుఎస్ లో ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.ఈ సినిమాలో ముఖ్యంగా సెకండాఫ్ లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఇంకా డైలాగ్స్ అయితే చాలా పవర్ ఫుల్ ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.మొత్తానికి ట్విట్టర్ రివ్యూల ప్రకారం చుస్తే ఈ సినిమా అక్కడ మంచి టాక్ సొంతం చేసుకోగా మరికొద్ది గంటల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ కాబోతుండడంతో ఇక్కడ ఎలాంటి టాక్ వినిపిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube