మన టాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్( Tollywood Overseas Market ) ఎంత కీలకమో అందరికీ తెలిసిందే.‘దూకుడు’ మరియు ‘గబ్బర్ సింగ్‘ సమయం లో మన టాలీవుడ్ కి ఇక్కడ పెద్ద మార్కెట్ ఏర్పడింది.ఆ తర్వాత టాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్ అనేది ఒక కంచుకోట గా మారిపోయింది.ఇక్కడ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే కాదు, డైరెక్టర్స్ కి కూడా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ఉంది, ఒక్క బోయపాటి శ్రీను సినిమాలకు తప్ప.
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే, ఓవర్సీస్ లో బోయపాటి శ్రీను తో సినిమా తీస్తే చిల్లర వసూళ్లే వస్తాయి.అతని కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు 1 మిలియన్ డాలర్ మార్కుని అందుకున్న ఏకైక సినిమా ‘అఖండ'( Akhanda ) మాత్రమే.
దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు బోయపాటి శ్రీను సినిమాలను ఇక్కడి ఆడియన్స్ ఎంతలా అసహ్యించుకుంటారో అనడానికి.
రీసెంట్ గా రామ్ పోతినేని( Ram Pothineni ) తో కలిసి ఆయన చేసిన ‘స్కంద’ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది.మొదటి రోజు మొదటి ఆట నుండే ఈ సినిమాకి ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది.మితిమీరిన హింస తప్ప, ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా తియ్యలేదని, పాపం రామ్ తన బెస్ట్ ఇచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోయిందని చూసిన ప్రతీ ప్రేక్షకులు అంటూ ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి.మొదటి మూడు రోజులు ఈ చిత్రానికి 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
ఈరోజు ఆదివారం, రేపు కూడా సెలవు అవ్వడం తో మొదటి 5 రోజుల్లో 23 కోట్ల రూపాయిల షేర్ ని సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.
ఇక్కడ కలెక్షన్స్( Skanda Collections ) ఎలా ఉన్నా, ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి అతి నీచమైన వసూళ్లు వస్తున్నాయి.ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఈ ప్రాంతం లో కోటి 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.నిన్న అయితే ఈ చిత్రానికి ఓవర్సీస్ లో గ్రాస్ అయితే వచ్చింది కానీ, అందులో షేర్ ఒక్క రూపాయి కూడా మిగలలేదు అని అంటున్నారు.
అంటే సున్నా వసూళ్లు వచ్చాయి అన్నమాట.ఈమధ్య కాలం లో విడుదలైన ఏ సినిమాకి కూడా ఇలాంటి వసూళ్లు రాలేదు.బోయపాటి శ్రీను( Boyapati Srinu ) సూపర్ హిట్ సినిమాలకే ఇక్కడ వసూళ్లు ఉండవు, అలాంటిది ఫ్లాప్ సినిమాలకు ఈ మాత్రం దరిద్రం ఉండదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.