అక్కినేని నాగార్జున(Nagarjuna ) ఈమధ్య సినిమాలలో నటిస్తున్నా కానీ గత కొంతకాలం నుంచి ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.ఇక గత ఏడాది నాగార్జున ఘోస్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది .ఈ సినిమా విడుదలైన దాదాపు ఏడాది తర్వాత నాగార్జున నా సామిరంగా (Naa Saamiranga) అనే సినిమాని ప్రకటించారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా ద్వారా ఎలాగైనా హిట్ అందుకోవాలనే ఉద్దేశంలో నాగార్జున గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట.
విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించకపోయిన ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో ఒకరు కాదని ఏకంగా ఇద్దరు హీరోయిన్స్ సమాచారం.
మొదటి అమ్మాయి ఆషిక రంగనాథ్ (Ashika Ranganath) కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఈమె కన్నడ భాషలో మంచి సక్సెస్ సినిమాలను అందుకున్నప్పటికీ తెలుగులో కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారు.ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందించలేకపోయింది.
ఈ క్రమంలోనే నాగార్జున నటిస్తున్నటువంటి నా స్వామి రంగా సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.ఇక ఈమెతో పాటు మరొక హీరోయిన్ గా మలయాళీ కుట్టి మిర్న మీనన్ (Mirna Menon).ఈమె ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలలో నటించారు.
ఆది సాయికుమార్ నటించిన క్రేజీ ఫెలో అల్లరి నరేష్ నటించిన ఉగ్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమాల ద్వారా కూడా ఈమె పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.
తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో రజనీ కోడలుగా నటించినది ఈమె.ఇలా ఈ ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో నటించబోతున్నారంటూ ఒక వార్త వస్తుంది.మరి వీరిద్దరూ నాగార్జున సరసన నటిస్తారా లేకపోతే ఈ సినిమాలో నటిస్తున్నటువంటి అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లకు జోడిగా నటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.