Ram Boyapati RAPO20: రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతులను టచ్ చేయబోతున్న బోయపాటి.. క్లిక్ అయ్యేనా?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ‘RAPO20’. ఇటీవలే బోయపాటి బాలయ్యతో అఖండ సినిమా తీసి ఘన విజయం అందుకుని తన నెక్స్ట్ సినిమా కోసం మరింత జోష్ గా సిద్ధం అవుతున్నాడు.

 Ram Pothineni And Boyapati Rapo20 Movie Latest Update Details, Sreeleela, Boyapa-TeluguStop.com

అఖండ ఇచ్చిన బూస్ట్ తో రామ్ తో చేతులు కలిపి మరొక యాక్షన్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని తహతహ లాడుతున్నాడు.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి.

ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో ఫుల్ ఫోకస్ పెట్టి తెరకెక్కించ బోతున్నారు.ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.

ఇప్పటికే శరవేగంగా షూట్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.ఈ సినిమాను బోయపాటి ఆంధ్రా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మిక్స్ చేసి తీయబోతున్నాడు అంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రామ్ ఎనర్జీని మ్యాచ్చేస్తూ బోయపాటి రొటీన్ కు బిన్నంగా ఉండే యాక్షన్ కంటెంట్ ను రెడీ చేసాడని.ఇది సినిమాకే హైలెట్ అవుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ఇక బోయపాటి ఆంధ్రా-తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని బేస్ చేసుకుని తెలుగు రాష్ట్రాల గొప్ప సంస్కృతిని టచ్ చేస్తూ సినిమా కథను రాసుకున్నట్టు టాక్.మరి దీనిని పూర్తి స్థాయిలో ఈ జనరేషన్ ను ఆకట్టుకునేలా తీయగలిగితే మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం.

Telugu Rapo, Boyapati Srinu, Sri Leela, Ram Pothineni, Sreeleela, Telugu-Movie

అఖండ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు ఇప్పుడు కలిసి వస్తుంది అనే చెప్పాలి.మరి మీడియాలో వస్తున్న కథనాల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ ప్రెజెంట్ వైరల్ అవుతుంది.ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ గురువారం హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.రామ్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్ దాదాపు నెల పాటు జరగనుందట.చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నాడు.మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube