నటి శ్రీదేవితో అలాంటి సినిమా తీస్తారా అంటూ ఆర్జీవి ని అడిగిన యాంకర్....

తెలుగు సినీ పరిశ్రమలో తన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయినటువంటి ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.

అయితే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కూడా ఎంతటి క్లిష్ట ప్రశ్న అయినా సరే తన దైన శైలిలో సమాధానం చెబుతూ ముక్కు సూటిగా మాట్లాడడం ఈ దర్శకుడి స్పెషాలిటీ.

అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ తన చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.అయితే ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఇంటర్వ్యూ చేసేటువంటి యాంకర్ రామ్ గోపాల్ వర్మ ని మీకు స్వర్గీయ నటి శ్రీదేవి అంటే చాలా అభిమానం కదా మరి ఆమెతో సినిమా తీసే అవకాశం వస్తే శృంగార భరిత తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తారా.? అంటూ ప్రశ్నించింది.దీంతో రామ్ గోపాల్ వర్మ ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేస్తూ ముందుగా తాను గతంలో తీసినటువంటి చిత్రాలలో ఎక్కడా కూడా శృంగార భరిత తరహా సన్నివేశాలు లేవని అన్నారు.

అలాగే ప్రశ్నలు అడిగే ముందు కొంచెం ఆలోచించి అడగాలని యాంకర్ కి సూచించాడు.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అంతేగాక రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ అంటే కత్తి మీద సాము లాంటి పని కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడిగి  అతడిని విసిగిస్తే ఇలాంటి సమాధానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత కథ ఆధారంగా "పవర్ స్టార్" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోగా టిక్ టాక్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న "సురేష్" అనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని నటిస్తున్నాడు.

Advertisement
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

తాజా వార్తలు