వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరొకరి మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.అవసరం ఉన్న లేకపోయినా అన్ని విషయాల్లో స్పందిస్తూ తనదైన శైలిలో మాటలు తూటాలుగా సంధిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఒకప్పుడు మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు ఆర్జీవీ.కానీ ఇప్పుడు అన్ని బి గ్రేడ్ సినిమాలు తీస్తూ వరస ప్లాప్స్ అందుకుంటున్నాడు.

అయినా కూడా అలంటి వివాదాస్పద సినిమాలు తీయడం మానడం లేదు.ఇటీవలే ‘జగమొండి’ పేరుతో ఆర్జీవీ ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.అది అలా ఉండగానే ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమాను అనౌన్స్ చేసాడు.ఈ మధ్య ఈయన తెరకెక్కించే సినిమా లన్నీ వివాదాస్పదం గానే ఉంటున్నాయి.ఇప్పుడు మళ్ళీ వివాదాస్పద సినిమానే ఎంచుకున్నాడని తెలుస్తుంది.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సినిమాలు తీసిన ఆర్జీవీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే తెలంగాణ రాజకీయాలపై, మావోయిస్టులపై సినిమా తీస్తాను అంటూ కొండా సురేఖ బయోపిక్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు ఈటెల రాజేందర్ పై ఒక సినిమా ప్రకటించి మరొక వివాదంలోకి అడుగు పెట్టాడు.
ఈటెల రాజేందర్ ను టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు పంపిన విషయం తెలిసిందే.ఇక ఈటెల హుజారాబాద్ ఎన్నికల్లో బిజెపి నుండి పోటీ చేయబోతున్నారు.
ఇప్పటికే ఎలెక్షన్స్ వల్ల ప్రచారాలు జోరుగా సాగుతుండగా మరొక పాక్ ఆర్జీవీ సినిమా ప్రకటించి షాక్ ఇచ్చాడు.ఈ సినిమా గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.‘‘నాకెందుకో ఈటెల రాజేందర్ కేసిఆర్ కు వెన్నుపోటు, ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు ఒకేలాగా అనిపించింది.అందుకే ఈ విషయంపై తెలంగాణ మేధావులను కనుక్కుని సినిమా తీస్తా” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేసాడు.

అలాగే ఈటెల కేసిఆర్ కు పొడిచిన వెన్నుపోటు సినిమాకి ‘వెన్నుపోటు ఈటెలు” అనే టైటిల్ ను పెట్టి పోస్టర్ కూడా పోస్ట్ చేసాడు.ఇప్పుడు ఈ వార్త తెలంగాణాలో చర్చనీయాంశం అయ్యింది.అయితే ఆర్జీవీ వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చెయ్యడం గమనార్హం.మరి చూడాలి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో.