వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆ మధ్య టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.బాలీవుడ్ సినిమాలతో పోల్చితే రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా రెట్టింపు అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
పుష్ప సినిమా ని కూడా ఆకాశానికి ఎత్తుతూ హిందీ సినిమాలు తల దించుకునే విధంగా ఆసక్తికరంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇప్పుడు కే జి ఎఫ్ 2 సినిమా పై ఆయన స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే కే జి ఎఫ్ 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా భారీ ఎత్తున కలెక్షన్స్ ను నమోదు చేస్తుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కే జి ఎఫ్ 2 సినిమా హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దాదాపుగా 39 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకుంది.
బాహుబలి 2 సినిమా 37 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లను రాబట్టింది.
ఈ రెండు సినిమాలు బాలీవుడ్ సినిమాలను సైతం పక్కకు నెట్టి అత్యధిక వసూళ్ల ను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దక్కించుకున్న సినిమాలు టాప్ లో నిలిచాయి.ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాలుగా ఈ రెండు నిలవడంతో బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏంటి అంటూ రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేస్తున్నాడు.
రాంగోపాల్ వర్మ షేర్ చేసిన ఒక జాబితా ప్రకారం నెంబర్ 3 గా 30 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో వార్ సినిమా నిలిచింది.ఇక అమీర్ ఖాన్ హీరోగా నటించిన తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 26 కోట్ల రూపాయలను రాబట్టింది.
ఇలా అన్ని సినిమాలు కూడా మన సౌత్ సినిమాల తర్వాత స్థానంలోనే ఉన్నాయి.ఈ స్థాయిలో మన సౌత్ సినిమాలు దక్కించుకోవడం పట్ల వర్మ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాలు అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.