మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) అలాంటి పని చేసి ప్రాణ భయంతో నాగార్జున ఇంట్లో తలదాచుకున్నారు అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.అయితే ఇది రూమర్ కాదు.
ఇది స్వయంగా నాగార్జున ( Nagarjuna ) నే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిన విషయం.మరి ఇంతకీ రామ్ చరణ్ ఎందుకు అంతలా భయపడ్డారు.
భయపడి పోయేంతలా అంత పెద్ద తప్పు ఏం చేశారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.మెగా ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే.
చిరంజీవి నాగార్జున మధ్య మాత్రమే కాదు రామ్ చరణ్,నాగచైతన్య,అఖిల్ ల మధ్య కూడా మంచి అనుబంధం ఉంటుంది.

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదట హీరోగా చేసిన సినిమా చిరుత( Chirutha ).ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.కానీ ఈ సినిమాకి ముందే రేపు మూవీ విడుదలవుతుంది అనగా రామ్ చరణ్ నాగార్జున దగ్గరికి వచ్చి చాలా భయపడిపోయారట.
దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి కొడుకు అంటే చాలామంది నాపై ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు.మరి అలాంటిది 100% ఈ సినిమాలో నేను ఇవ్వగలనా అంటూ అక్కినేని నాగార్జున దగ్గరికి వచ్చి భయపడ్డారట.

అంతేకాదు నాకు తెలిసి నేను 100% డ్యాన్స్ లో అయినా యాక్షన్ సన్నివేశాలు అయినా యాక్టింగ్ లో అయినా సరే పూర్తి ఎఫర్ట్ పెట్టాను.కానీ ఈ సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయంగా ఉంది అంటూ రామ్ చరణ్ నాగార్జున తో చెబుతూ భయపడ్డారట.కానీ రామ్ చరణ్ భయం చూసిన నాగార్జున నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు.సినిమా చాలా బాగుంది.ఖచ్చితంగా నువ్వు హిట్టు కొడతావు.నేను ఇప్పుడే ప్రివ్యూ షో చూశాను అలాంటి భయాలు ఏమి పెట్టుకోకు అంటూ ధైర్యం చెప్పారట.
ఇక సినిమా విడుదలై ఎలాంటి టాక్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే రామ్ చరణ్ (Ram Charan) మొదటి సినిమా కావడంతో భయంతో చిరుత సినిమా విడుదలయ్యే ముందు రోజు రాత్రి మొత్తం నాగార్జున ఇంట్లోనే ఉన్నారట.
ఇక ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడంతో అందరికీ తెలిసిపోయింది.







