అమెజాన్ ఇండియాలో పండుగ సందర్భంగా లక్ష ఉద్యోగాలు!

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు, జనాలు షాపింగ్ జోన్లలోకి వెళ్లిపోతారు.గల్లీలో వున్న షాపింగ్ మాల్ లో మురిగిపోయిన సరుకు కూడా సేల్ అయిపోతుంది.

 Lakh Jobs In Amazon India During The Festival! , Amazon India, Recruitment Driv-TeluguStop.com

ఇక ఆన్లైన్ షాపింగ్ గురించి వేరే చెప్పాలా? రకరకాల ఆఫర్లతో యువతని వూరిస్తూ వుంటాయి.ఈ క్రమంలోనే కొన్ని ఆన్లైన్ షాపింగ్ సంస్థలు కొత్తగా ఉద్యోగుల నియామకం చేపడతాయి.

ఈ క్రమంలోనే అమెజాన్ ఇండియా కొత్తగా తమ కార్యకలాపాల నెట్‌వర్క్‌ లో 100,000 కంటే ఎక్కువ కాలానుగుణ ఉద్యోగ అవకాశాలను సృష్టించినట్లు పేర్కొంది.ఢిల్లీ, పూణే, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ఎక్కువగా ఈ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు తెలుస్తోంది.

రాబోయేది పండుగల సీజన్ కావడంతో భారత మార్కెట్ పై అనేక ఈ కామర్స్ సంస్థలు ఈపాటికే ఓ కన్నేశాయి.ఎందుకంటే ఈ సీజన్ లో ఆయా సంస్థలకు అమ్మకాల పండుగ అనేది వుంటుంది.అందుకే అన్ని వర్గాల వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లు కూడా ఇస్తూ ఉంటాయి సంస్థలు.ఫ్లిప్ కార్ట్ ( Flipkart )ఇప్పటికే డిస్కౌంట్ ఇచ్చే తేదీలను ప్రకటించగా, అమెజాన్ నిన్న ప్రకటించడం గమనార్హం.

అమెజాన్( Amazon ) ఈ సీజన్ లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని పలు తాత్కాలిక ఉద్యోగాలను కూడా ఇస్తుంది.అంటే ఈ సమయంలో అమెజాన్ కు వచ్చిన ఆర్డర్స్ ను ఆయా వినియోగదారులకు చేర్చడం వరకు అనేక బాధ్యతలు ఈ ఉద్యోగులు నెరవేర్చాల్సి ఉంటుంది.

ఆ రకమైన ఉద్యోగాలను సృస్టిస్తున్నట్టు తెలుస్తోంది.ఇది ఓ రకంగా నిరుద్యోగులకు ఓ వరమని చెప్పుకోక తప్పదు.దాదాపు ఈ సీజనల్ ఉద్యోగాలు ఒక లక్షా పదివేల వరకు ఇవ్వడానికి సంస్థ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.అమెజాన్ నెట్ వర్క్ అసోసియేట్ గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

సంస్థ ఆర్డర్స్ తీసుకోవడం, వాటిని ప్యాక్ చేయడం, షిప్పింగ్ చేయడం, డెలివరీ వంటి వాటివరకు చేయాల్సి ఉంటుంది.అమెజాన్ డెలివరీ పార్టనర్ గా చేరాలనే వారు దానికోసం అమెజాన్ ఫ్లెక్స్( Amazon Flex ) అనే యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

దీనివలన రోజుకు 40 నుండి వంద ఆర్డర్స్ వరకు డెలివరీ చేయవచ్చు.ఇతర వివరాల కోసం https://flex.amazon.in/ లో చూడగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube