సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ( Mahesh Babu ) రామ్ చరణ్( Ramcharan ) ఎన్టీఆర్ ( Ntr ) ఈ ముగ్గురు కూడా వారి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ముఖ్యంగా ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమా షూటింగ్ పనులలో శరవేగంగా ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా వరుస షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్నటువంటి గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఇలా ఈ ముగ్గురు హీరోలు కూడా తమ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే మహేష్ బాబు తనకు సినిమా షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన తన పిల్లలు భార్యతో కలిసి విదేశాలకు పయనమవుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఇలా ఏడాదికి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మూడు నాలుగు సార్లు వెకేషన్ వెళ్తూ ఉంటారు.ఈసారి కూడా క్రిస్మస్ పండుగ రానున్న నేపథ్యంలో మహేష్ బాబు క్రిస్మస్ టూర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.
అయితే ఈసారి మహేష్ బాబు ఫ్యామిలీ మాత్రమే కాకుండా మరొక ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి ఈయన ఈ వెకేషన్ ప్లాన్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరి ఫ్యామిలీతో పాటు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఈసారి క్రిస్మస్ టూర్ ( Christmas Tour ) ప్లాన్ చేశారని తెలుస్తుంది.దాదాపు వారం రోజులపాటు వీరు ఈ వెకేషన్ ప్లాన్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.అప్పటికే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని వెకేషన్ తర్వాత ప్రమోషన్లలో బిజీ కానున్నారని తెలుస్తోంది.
ఇలా మహేష్ బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు కలిసి క్రిస్మస్ వెకేషన్ ప్లాన్ చేశారని విషయం తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ మూడు ఫ్యామిలీలు కలిసి ఎక్కడికి వెకేషన్ ప్లాన్ చేశారు అనే విషయానికి వస్తే… మహేష్ బాబుకి ఎంతో ఇష్టమైనటువంటి పారిస్ వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది.మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు కలిసి ఒకే చోట వెకేషన్ లో ఉండబోతున్నారని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు .ఇక ఈ ముగ్గురు హీరోల ఫ్యామిలీ కనుక ఒకే ప్రేమ్ లో ఉంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి.మరి వీరి క్రిస్మస్ వెకేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.