ఆచార్యలో చరణ్ పూజ అలా కనిపించనున్నారా..?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా చరణ్ ప్రత్యేక పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

చిరంజీవికి జోడీగా కాజల్ ఈ సినిమాలో నటిస్తుండగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.అయితే ఇండస్ట్రీ వర్గాల్లో చరణ్, పూజాహెగ్డే పాత్రలకు సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

ఇప్పటికే చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతోందని రేపటి నుంచి పూజా హెగ్డే ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో చరణ్, పూజా హెగ్డే ఇద్దరూ డీ గ్లామర్ పాత్రల్లో కనిపించడం గమనార్హం.

సినిమాల్లోని పాత్రల ప్రకారం చరణ్, పూజా హెగ్డే మేకప్ లేకుండా కనిపించాల్సి ఉంటుందని తెలుస్తోంది.కొరటాల శివ ఆచార్య కోసం చరణ్, పూజాలతో ఈ ప్రయోగం చేయనున్నారని సమాచారం.

Advertisement

అయితే మేకప్ లేకుండా చరణ్, పూజ ఎలా ఉంటారని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం గంటల తరబడి మేకప్ వేసుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ఆచార్య మూవీ కోసం మాత్రం చరణ్ మేకప్ ను పక్కన పెట్టేయడం గమనార్హం.

ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధా అనే పాత్రలో నటిస్తున్నారు.చిరంజీవి, చరణ్ కలిసి ఒకే సినిమాలో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇప్పటివరకు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఆచార్య సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు