మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని చరణ్ ఫస్ట్ లుక్‌ను తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తరువాత చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఆర్ఆర్ఆర్ తరువాత హీరోగా చరణ్ నటించబోయే సినిమాకు సంబంధించి పలు వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇప్పటికే చరణ్ పలువురు డైరెక్టర్ల కథలు వింటున్నాడని, అయినా ఇంకా ఎలాంటి కథకు ఓకే చేయలేదని తెలుస్తోంది.కాగా ఇటీవల మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి చరణ్‌కు ఓ అదిరిపోయే కథను వినిపించాడట.
అది చరణ్‌కు కూడా బాగా నచ్చిందట.
దీంతో కథను పూర్తిగా రెడీ చేయాలని అనిల్ రావిపూడికి చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.





 

