అదిరిపోయిన రామ్ చరణ్ మీషో యాడ్... వైరల్ అవుతున్న వీడియో!

ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో స్టార్ట్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారందరూ ఓవైపు ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా మరోవైపు పలు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పలు యాడ్స్ ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 Ram Charan Meesho Ad Is Going Viral Details, Ram Charan ,meesho Ads,rashmika, Ga-TeluguStop.com

ఈ క్రమంలోని తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరొక యాడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ యాడ్ లో కేవలం రామ్ చరణ్ మాత్రమే కాకుండా రష్మిక, రోహిత్ శర్మ, గంగోలి వంటి వారు కూడా సందడి చేశారు.

ఇలా ఇంతమంది స్టార్స్ కలిసి ఉత్పత్తులను ప్రమోట్ చేసారనే విషయానికి వస్తే ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ అయినటువంటి మీషో ప్రమోటర్ గా ఈ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున యాడ్ లో నటించారు.ఈ ప్రకటనలో చరణ్, రష్మిక, గంగూలీ, రోహిత్ శర్మ సేల్స్ మ్యాన్స్‏గా మారి రండి రండి బట్టలు కొనండి అంటూ తమదైన స్టైల్లో నటించారని చెప్పాలి.

ఇక చరణ్ రష్మిక అంటే నటీనటులు కనుక అద్భుతంగా నటించారు ఇక రోహిత్ శర్మ గంగోలి కూడా అద్భుతమైన నటనను కనపరిచారని చెప్పాలి.ఇక గతంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తో కలిసి ఫ్రూటీ యాడ్ లో కనిపించిన రామ్ చరణ్ తాజాగా గంగోలి రోహిత్ శర్మ రష్మిక వంటి వారితో కలిసి మీషో యాడ్ ద్వారా సందడి చేశారు.ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక రాంచరణ్ సినిమాల విషయానికొస్తే ఈయన శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయి సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం RC 15 టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube