చరణ్ తో నటిస్తే హీరోయిన్ కు పెళ్లి తప్పదా.. సెంటిమెంట్ నిజమైందంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు.

ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారు.

అయితే చరణ్ తో ఏ హీరోయిన్ నటించినా ఆ హీరోయిన్ కు పెళ్లవుతుందని ఇండస్ట్రీలో కొత్త సెంటిమెంట్ జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.చరణ్, సమంత కాంబినేషన్ లో రంగస్థలం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

రంగస్థలం మూవీ రిలీజ్ అయిన తర్వాతే సమంత చైతన్య పెళ్లి జరిగింది.చైసామ్ కొంతకాలం సంతోషంగానే జీవనం సాగించినా ఆ తర్వాత వేర్వేరు రీజన్స్ వల్ల వాళ్లు విడిపోయారు.

చరణ్ అలియా కాంబినేషన్ లో ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కి రిలీజ్ కాగా ఈ సినిమా రిలీజైన వెంటనే అలియా భట్ పెళ్లి పీటలు ఎక్కేశారు.చరణ్ కియారా అద్వానీ ప్రస్తుతం కలిసి నటిస్తుండగా తాజాగా ఈ హీరోయిన్ కు కూడా పెళ్లైంది.

Advertisement

చరణ్ విషయంలో ఈ కొత్త సెంటిమెంట్ తెరపైకి రావడంతో ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.రాబోయే రోజుల్లో కూడా హీరోయిన్ల విషయంలో ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు కూడా పెళ్లవుతుందేమో చూడాల్సి ఉంది.మరోవైపు చరణ్ వరుసగా కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తున్నారు.

లోకేశ్ కనగరాజ్ లియో మూవీలో కూడా చరణ్ నటిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారం గురించి స్పష్టత రావాల్సి ఉంది.చరణ్ మాత్రం భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో పూర్తి క్లారిటీ ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.సినిమా సినిమాకు చరణ్ రేంజ్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు