మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఈ సినిమాతో ఇతడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
దీంతో చరణ్ లైనప్ కూడా భారీ స్థాయిలోనే ఉంది.ఈ క్రమంలోనే ఈ సినిమా కంటే ముందు ప్రకటించిన లైనప్ లో మార్పులు ఉంటాయని ముందు నుండి వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలను నిజం చేస్తూ గత కొన్ని రోజులుగా చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోయే RC16 సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.అయితే ఈ సినిమా ఆగిపోయింది అంటూ వచ్చిన వార్తలపై మెగా కాంపౌండ్ నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో నిజమే అని అంతా నమ్మారు.
మరి ఇప్పటి వరకు రూమర్స్ గానే మిగిలి పోయిన ఈ వార్తలపై తాజాగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కాంబో ఆగిపోయింది అంటూ అఫిషియల్ గా ప్రకటించారు.చరణ్ పి ఆర్ టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది.అఫిషియల్ గా ట్వీట్ చేస్తూ ఈ కాంబో ఆగిపోయింది అని నెక్స్ట్ ఎవరితో చరణ్ సినిమా ఉంటుంది అనేది త్వరలోనే క్లారిటీ ఇస్తామని కన్ఫర్మ్ చేసారు.
ఇలా మొత్తానికి జెర్సీ డైరెక్టర్ ను అయితే చరణ్ పక్కన పెట్టాడు.ఇక ప్రెజెంట్ చరణ్ RC15 చేస్తున్నాడు.అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.
ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.







