సాధారణంగా పిల్లులు చాలా అల్లరి చేస్తుంటాయి.అవి ఇల్లంతా పరిగెడుతూ, దూకుతూ నానా రభస సృష్టిస్తాయి.
అందుకే వీటిని పెంచుకునే యజమానులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే విలువైన వస్తువులు కింద పడిపోయి.
తీవ్ర నష్టం వాటిల్లక తప్పదు.కాగా తాజాగా ఒక పిల్లి యజమాని మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు.
అతని పిల్లి చాలా విలువైన యాపిల్ మ్యాక్ కంప్యూటర్‌ను కింద పడేసింది.దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది.
@perfectcutvids అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 78 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వైరులవుతున్న వీడియోలో ఒక నల్ల పిల్లి కిటికీ పక్కన కూర్చుని ఉండడం చూడవచ్చు.
దానికి ముందు వైపు ఒక బల్ల ఉండగా దానిపై మ్యాక్ డెస్క్‌టాప్ కంప్యూటర్ ఉంది.కాగా ఆ నల్ల పిల్లి ఒక్కసారిగా కంప్యూటర్ పై దూకింది.అంతే మానిటర్ బల్లపై నుంచి కింద పడిపోయింది.ఈ దృశ్యాన్ని చూసిన యజమాని ఒక్కసారిగా గట్టిగా అరిచాడు.
యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ ఎంత ఖరీదు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అలాంటి ఖరీదైన మానిటర్ కింద పడిపోవడంతో యజమానికి జేబుకి పెద్ద చిల్లు పడినట్లు అయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.ఇప్పటికల్లా ఆ యజమాని ఆ పిల్లిని చంపేసి దాని వండుకొని తిన్నాలా అని ఒక యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ చేయండి.ఇక్కడ యజమానిదే తప్పు.పిల్లులు ఉన్నప్పుడు కనీసం జాగ్రత్త పడటం తెలీదా అని చాలామంది ఇందులో యజమాని తప్పు ఉందని తేలుస్తున్నారు.అంత చివరిలో కంప్యూటర్ ఉంచడం తెలివి తక్కువ పని కాక ఇంకేంటి అని కొందరు అతన్ని తిట్టుకొస్తున్నారు.







