బిగ్ బాస్ సీజన్ 6 లో ఇనాయ అనూహ్యంగా మంచి గుర్తింపు దక్కించుకుంది.మొదటి రెండు మూడు వారాల్లోనే ఈమె వెళ్లి పోతుందని అంతా భావించారు.
కాని మొదట ఈమె శ్రీహాన్ తో గొడవ వల్ల ఆ తర్వాత సూర్య తో క్లోజ్ గా ఉండటం వల్ల జనాల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది.అయితే బిగ్ బాస్ ప్రేక్షకులు ఈమె ను జనాలు ఆధరిస్తూ ఉన్నారు.
తాజాగా బిగ్ బాస్ 6 మరో ఎలిమినేషన్ కి నామినేషన్ జరిగాయి.నిన్నటి సోమవారం ఎపిసోడ్ లో ఎక్కువ శాతం మంది ఇనాయ ను నామినేట్ చేయడం జరిగింది.
నామినేట్ చేసిన సభ్యులు అంతా కూడా కేవలం ఆమె గత వారం ఆర్జే సూర్య ను నామినేట్ చేసి అతడు వెళ్లి పోవడానికి కారణం అయ్యింది.ఆ తర్వాత అతడు వెళ్లి పోయిన సమయంలో బోరున ఏడ్చేసింది.
అతడు వెళ్లి పోవాలని నామినేట్ చేయడం ఎందుకు.అతడు వెళ్లి పోయిన సమయంలో ఏడ్వడం ఎందుకు అంటూ ఇంటి సభ్యులు ఆమె ప్రవర్తనను తప్పబడుతూ నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించి ఆమె యొక్క కుండను బద్దలు కొట్టారు.

ఎలాగూ ఆర్జే సూర్య వెళ్లడు కనుక నామినేట్ చేద్దాం అనుకుని నామినేట్ చేసిందని.కానీ అతడు నామినేషన్ లో ఉన్న కారణంగా ఎలిమినేట్ అయ్యాడని ఆమె యొక్క గేమ్ గందరగోళంగా ఉందంటూ ఆమె కు చాలా సీరియస్ గా కారణాలు చెప్పి ఆమెను నామినేట్ చేయడం జరిగింది.శ్రీహాన్ మరియు ఇనాయ మధ్య జరిగిన నామినేషన్స్ రచ్చ అంతా ఇంతా కాదు.ఇక ఇనాయ మరియు ఫైమా మధ్య జరిగిన రచ్చ కూడా అంతా ఇంతా కాదు.
మొత్తానికి సూర్య ఇష్యూ కారణంగా ఇనాయ ను టార్గెట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఆమె ను నామినేషన్ లో ఉంచేశారు.బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







