1000 మందితో రామ్ చరణ్ ఫైట్.. గేమ్ ఛేంజర్ మూవీ క్లైమాక్స్ ను ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?

తమిళ దర్శకుడు శంకర దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్.( Game Changer ) ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 Ram Charan Game Changer Movie Climax Fight Talk Details, Ram Charan, Climax Figh-TeluguStop.com

ఇకపోతే శంక‌ర్( Director Shankar ) సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికి తెలిసిందే.శంకర్ మూవీ లో ప్రతి ఒక్క ఫైట్ లో ఒక కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా తెర‌కెక్కిస్తోన్న ఆర్సీ 16 లో అంత‌కు మించి హైఆక్టేన్ యాక్ష‌న్ స‌న్నివేశాలు డిజైన్ చేసిన‌ట్లు ఇప్ప‌టికే తెలిసింది.భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాలో ఉన్నాయ‌ని రివీల్ అయింది.

Telugu Climax, Shankar, Game Changer, Gamechanger, Kiara Advani, Ram Charan, Ram

షూటింగ్ దాదాపు 80 శాతానికి పైగా పూర్త‌వ్వ‌డంతో ఆ యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా పూర్త‌య్యాయి.తాజాగా క్లైమాక్స్ యాక్ష‌న్ స‌న్నివేశం( Climax Action Scene ) ఒక‌టి నెక్స్ట్ లెవ‌ల్ లో ఉండ‌బోతుంది అన్న లీక్ అందింది.చ‌ర‌ణ్ ఏకంగా ఒకేసారి 1000 మందితో త‌ల‌పేడాలా ఒక యాక్ష‌న్ స‌న్నివేశం ఉందట‌.ఈ ఫైట్ క్లైమాక్స్ కి ముందు వ‌స్తుందని చిత్ర‌వర్గాల నుంచి లీకైంది.త‌దుప‌రి షెడ్యూల్ లో ఈ యాక్ష‌న్ స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని స‌మాచారం.ఈ ఫైట్ స‌న్నివేశాన్ని భారీ ఎత్తున విదేశీ పైట‌ర్లు స్థానిక ఫైట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ఉంటుందట‌.

విదేశీ స్టంట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో చిత్రీక‌రించ‌నున్నారుట‌.

Telugu Climax, Shankar, Game Changer, Gamechanger, Kiara Advani, Ram Charan, Ram

చ‌ర‌ణ్ వాళ్లంద‌రి పై ప్ర‌తిదాడికి దిగే ఈ యాక్ష‌న్ స‌న్నివేశం సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు.అయితే ఈ ఫైట్ కోసం చ‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం అయ్యాడా? లేదా? అన్న‌ది మాత్రం ఇంకా లీక్ అవ్వ‌లేదు.శంక‌ర్ ఒక కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఫైట్ డిజైన్ చేస్తే దానికి సంబంధించి హీరోకి ప్ర‌త్యేక‌మైనట్రైనింగ్ ఇప్పిస్తారు.

మ‌రి చ‌ర‌ణ్ కి ఆ ర‌క‌మైన ట్రైనింగ్ ముందే ఇప్పించారా? లేదా? అన్న‌ది తెలియాలి.అలాగే ఈ ఫైట్ చిత్రీక‌ర‌ణ ఎక్క‌డ ఉంటుంది? అన్న‌ది తెలియాలి.క్లైమాక్స్ స‌న్నివేశాలు రాజ‌మండ్రి విశాఖ ప‌ట్ట‌ణంలో పూర్తి చేస్తార‌ని ఇప్ప‌టికే యూనిట్ రివీల్ చేసింది.మ‌రి వాటితో పాటు ఈ ఫైట్ ని ఆయా ప్రాంతాల్లో షూట్ చేస్తారా? లేక‌ హైద‌రాబాద్ వేదిక‌గా చిత్రీక‌రిస్తారా? అన్న‌ది తెలియాలి.త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube