1000 మందితో రామ్ చరణ్ ఫైట్.. గేమ్ ఛేంజర్ మూవీ క్లైమాక్స్ ను ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?

తమిళ దర్శకుడు శంకర దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్.

( Game Changer ) ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే శంక‌ర్( Director Shankar ) సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికి తెలిసిందే.

శంకర్ మూవీ లో ప్రతి ఒక్క ఫైట్ లో ఒక కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా తెర‌కెక్కిస్తోన్న ఆర్సీ 16 లో అంత‌కు మించి హైఆక్టేన్ యాక్ష‌న్ స‌న్నివేశాలు డిజైన్ చేసిన‌ట్లు ఇప్ప‌టికే తెలిసింది.

భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాలో ఉన్నాయ‌ని రివీల్ అయింది. """/" / షూటింగ్ దాదాపు 80 శాతానికి పైగా పూర్త‌వ్వ‌డంతో ఆ యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా పూర్త‌య్యాయి.

తాజాగా క్లైమాక్స్ యాక్ష‌న్ స‌న్నివేశం( Climax Action Scene ) ఒక‌టి నెక్స్ట్ లెవ‌ల్ లో ఉండ‌బోతుంది అన్న లీక్ అందింది.

చ‌ర‌ణ్ ఏకంగా ఒకేసారి 1000 మందితో త‌ల‌పేడాలా ఒక యాక్ష‌న్ స‌న్నివేశం ఉందట‌.

ఈ ఫైట్ క్లైమాక్స్ కి ముందు వ‌స్తుందని చిత్ర‌వర్గాల నుంచి లీకైంది.త‌దుప‌రి షెడ్యూల్ లో ఈ యాక్ష‌న్ స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని స‌మాచారం.

ఈ ఫైట్ స‌న్నివేశాన్ని భారీ ఎత్తున విదేశీ పైట‌ర్లు స్థానిక ఫైట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ఉంటుందట‌.

విదేశీ స్టంట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో చిత్రీక‌రించ‌నున్నారుట‌. """/" / చ‌ర‌ణ్ వాళ్లంద‌రి పై ప్ర‌తిదాడికి దిగే ఈ యాక్ష‌న్ స‌న్నివేశం సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు.

అయితే ఈ ఫైట్ కోసం చ‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం అయ్యాడా? లేదా? అన్న‌ది మాత్రం ఇంకా లీక్ అవ్వ‌లేదు.

శంక‌ర్ ఒక కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఫైట్ డిజైన్ చేస్తే దానికి సంబంధించి హీరోకి ప్ర‌త్యేక‌మైనట్రైనింగ్ ఇప్పిస్తారు.

మ‌రి చ‌ర‌ణ్ కి ఆ ర‌క‌మైన ట్రైనింగ్ ముందే ఇప్పించారా? లేదా? అన్న‌ది తెలియాలి.

అలాగే ఈ ఫైట్ చిత్రీక‌ర‌ణ ఎక్క‌డ ఉంటుంది? అన్న‌ది తెలియాలి.క్లైమాక్స్ స‌న్నివేశాలు రాజ‌మండ్రి విశాఖ ప‌ట్ట‌ణంలో పూర్తి చేస్తార‌ని ఇప్ప‌టికే యూనిట్ రివీల్ చేసింది.

మ‌రి వాటితో పాటు ఈ ఫైట్ ని ఆయా ప్రాంతాల్లో షూట్ చేస్తారా? లేక‌ హైద‌రాబాద్ వేదిక‌గా చిత్రీక‌రిస్తారా? అన్న‌ది తెలియాలి.

త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంది.

వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం పవన్ తొలి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్.. ఏం చెప్పారంటే?