టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ( Ram Charan )ఏ సినిమాలో నటించినా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం కోసం ప్రాణం పెట్టి నటిస్తారనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ ( game changer )సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం అంతాఇంతా కాదని తెలుస్తోంది.
రెండు షేడ్స్ ఉన్న రోల్స్ లో రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం.అయితే ఈ సినిమాలోని సీన్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూట్ భువనగిరి మండలంలోని భీమరావ్ పల్లెలో జరుగుతుండగా రామ్ చరణ్ పాత్ర కల్తీ బియ్యాన్ని పట్టుకునే సన్నివేశాన్ని షూట్ చేశారని తెలుస్తోంది.చరణ్ ఆఫీసర్ లుక్ లో ( Officer look )కనిపిస్తారని చరణ్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉండనుందని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమాతో బాక్సాఫీస్ లెక్కల్లో కూడా చరణ్ గేమ్ ఛేంజర్ కానున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
శంకర్ ఈ సినిమాలోని సాంగ్స్ కోసమే 90 కోట్ల రూపాయలు( 90 crore rupees ) ఖర్చు చేస్తున్నారు.ఖర్చు విషయంలో శంకర్ రాజీ పడటం లేదని ప్రతి సీన్ భారీ లెవెల్ లో ఉండనుందని సమాచారం.తెలుగు, తమిళ భాషల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని భోగట్టా.
గేమ్ ఛేంజర్ సినిమాను పోటీ లేకుండా రిలీజ్ చేయాలని దిల్ రాజు( dil raju ) భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
తన సినీ కెరీర్ లోనే ఎక్కువ మొత్తం లాభాలను అందించిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారని తెలుస్తోంది.గేమ్ ఛేంజర్ మూవీ లీక్డ్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటారో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తారో చూడాలి.
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy