మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరో గా ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా దర్శకుడు శంకర్( Director Shankar ) ఇండియన్ 2 సినిమా షూటింగ్ చేస్తున్న కారణంగా ఆలస్యం అవుతుంది.
కచ్చితంగా వచ్చే ఏడాది సమ్మర్ వరకి గేమ్ చేంజర్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు శంకర్ ఆ మధ్య ఆఫ్ ది రికార్డ్ పేర్కొన్నాడు.నిర్మాత దిల్ రాజు కూడా సినిమా ను సమ్మర్ లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహితుల వద్ద పేర్కొన్నాడు.

అందుకే దసరా కు సినిమా యొక్క అప్డేట్ ఇవ్వలేదు అంటూ సమాచారం అందుతుంది.అయితే దసరా కు రాని అప్డేట్ ని కచ్చితంగా దీపావళి( Deepavali ) సందర్భంగా ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతుంది.కేవలం గేమ్ చేంజర్ సినిమా విషయం లోనే కాకుండా బుచ్చిబాబు ( Buchi Babu ) సినిమా విషయం లో కూడా ఆసక్తికర ప్రకటన దీపావళి కి ఉంటుంది అంటూ మెగా ఫాన్స్ కి లీక్ అందుతుంది.రామ్ చరణ్ కి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి క్రేజ్ ఉంది.
కనుక ఆ క్రేజీ కి ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శంకర్ భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా ను రూపొందిస్తున్నాడు.

ఇక గేమ్ చేంజర్ సినిమా కు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు బుచ్చిబాబు ఒక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా ని( Sports Drama Movie ) రామ్ చరణ్ తో రూపొందిస్తున్నాడు.ఉప్పెన వంటి చిన్న సినిమా తో స్టార్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న బుచ్చి బాబు ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా తో స్టార్ దర్శకుల జాబితా లో చేరబోతున్నాడు అంటూ మీడియా సర్కిల్స్ లో మరియు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.మొత్తానికి ఈ రెండు సినిమాల యొక్క అప్డేట్స్ దీపావళి కి రాబోతున్న నేపథ్యం లో మెగా ఫ్యాన్స్ కి ఫుల్ వినోదాల విందు ఖాయం.