ప్రస్తుతం అధికార వైసీపీ పార్టీ( YCP party ) లో ఉన్న ముఖ్య నాయకులంతా మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ‘ప్రజారాజ్యం’ పార్టీ నుండి వచ్చిన వాళ్ళే.పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ స్థాపించకముందు చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులుగా కొనసాగారు.
ఉదాహరని పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి గెలుపొందిన భీమవరం ఎమ్యెల్యే గ్రంధి శ్రీనివాస్( MLA Granthi Srinivas ) పవన్ కళ్యాణ్ కి అప్పట్లో ఎంత పెద్ద వీరాభిమాని అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలయ్యేటప్పుడు, అలాగే ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు భీమవరం లో అడుగడుగునా పవన్ కళ్యాణ్ బ్యానర్స్ వేయించేవాడు ఈయన.కానీ రాజకీయంగా మాత్రం జగన్ వైపు ఉన్నాడు.ఇలా ఎంతోమంది పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు వైసీపీ పార్టీ లో ఉన్నారు.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సిఫార్సు తో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఎమ్యెల్యే సీట్స్ దక్కించుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై నోటికి వచ్చినట్టు మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కి ప్రాణ స్నేహితుడు,ప్రస్తుత వైసీపీ ఎమ్యెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ( Former Minister Kodali Nani )కూడా పవన్ కళ్యాణ్ పై అనేక సందర్భాలలో తీవ్రమైన విమర్శలు చేసినవాడే.కానీ అనేక సందర్భాలలో ఆయన పవన్ కళ్యాణ్ పై సాఫ్ట్ గా మాట్లాడాడు కూడా.పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ హీరో, మంచి కలెక్షన్స్ వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు కానీ, ఆవేశపరుడు, నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతాడు అదొక్కటే ఆయనతో వచ్చే సమస్య అని చెప్తాడు.
అంతే కాదు పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అవినీతిపరుడు, వెన్నుపోటు దారుడు అయిన చంద్రబాబు తో చేతులు కలిపితే మాత్రం మేము ఆయన పై తీవ్రంగా విరుచుకుపడుతాము, ఇందులో ఎలాంటి సందేహం లేదంటూ చెప్పుకొచ్చాడు.అంతే కాదు పవన్ కళ్యాణ్ ని కలిసి నిజానిజాలు ఏంటో చెప్పడానికి చాలా సార్లు ప్రయత్నం చేశాను ఆయన అప్పోయింట్మెంట్ ఆర్డర్ దొరకలేదు అని కూడా అన్నాడు.

ఇకపోతే రీసెంట్ గా వంగవీటి మోహన్ రంగ ( Vangaveeti Mohan Ranga )కొడుకు వంగవీటి రాధ వివాహానికి పవన్ కళ్యాణ్ అతిథి గా విచ్చేసి ఆశీర్వదించి వెళ్ళాడు.ఈయన వచ్చిన సమయానికే కొడాలి నాని కూడా వచ్చాడు.పవన్ కళ్యాణ్ ని చూడగానే కొడాలి నాని నమస్కారం చేసి కరచాలనం చేస్తాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.కొడాలి నాని అప్పుడప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ తో సాఫ్ట్ గా ఉండడానికి కారణం ఆయన అభిమానుల ఓట్ల కోసమే.ఆయన అనుచరులలో, అలాగే గుడివాడ ప్రాంతం లో అత్యధికంగా పవన్ కళ్యాణ్ అభిమానులే ఉంటారు.
ఆయన సామాజిక వర్గం కూడా చాలా పెద్దదే, అందుకే అప్పుడప్పుడు కొడాలి నాని ఇలా పవన్ కళ్యాణ్ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంటాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







