నాటు నాటు పాటకి ఆస్కార్‌ తో ఆ ఇద్దరూ ప్రభాస్‌ని మించినట్లేనా?

రాజమౌళి ( Rajamouli )దర్శకత్వం లో వచ్చిన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమా నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ అవార్డు తో చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.

 Ram Charan And Ntr Get More Hype Than Prabhas Due To Naatu Naatu Oscar Award , R-TeluguStop.com

ఇక ఆ పాట లో డాన్స్ చేసిన రామ్ చరణ్ ( ram charan )మరియు ఎన్టీఆర్( ntr) ఏకంగా హాలీవుడ్ స్టార్స్ సరసన నిలిచే అవకాశాలను సొంతం చేసుకున్నారు.బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయి హీరో గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇండియా లో అత్యధిక క్రేజ్ ఉన్న హీరో గా ప్రభాస్ ఇప్పటి వరకు వెలుగు వెలిగాడు.అయితే నాటు నాటు ఆస్కార్ అవార్డు తర్వాత రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ యొక్క స్థాయి అమాంతం పెరిగింది.

అద్భుతమైన స్క్రీన్ ప్రజెంట్ తో వారిద్దరూ పాట స్థాయిని మరింతగా పెంచారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ నేపథ్యం లో ప్రభాస్ కంటే కూడా ఎక్కువగా వారిద్దరి స్టామినా స్టార్డం పెరిగిందని, ఇక ముందు ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే ఈ ఇద్దరు హీరోలు అంతకు రెట్టింపు రెమ్యూనరేషన్ అందుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.అతి త్వరలోనే వీరిద్దరూ హాలీవుడ్ సినిమాలను కూడా చేసేందుకు రెడీ అవుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది.మొత్తానికి అద్భుతమైన ఆస్కార్‌ అవార్డు తో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ స్థాయి ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయింది.

ఈ క్రేజ్ ని వారు సద్వినియోగం చేసుకొని మంచి ప్రాజెక్ట్ లను హాలీవుడ్ లో చేస్తే తప్పకుండా తెలుగు జాతి గర్వించే స్థాయి హీరోలవుతారు అనడంలో సందేహం లేదు.ప్రస్తుతానికి వీరిద్దరు చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా స్థాయి మార్కెట్ లో విడుదల కాబోతున్నాయి.

ముందు ముందు తప్పకుండా వీరిద్దరి సినిమాలు పాన్ వరల్డ్ రేంజ్ లో ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube