బోయపాటి కి ఇప్పటికి అయినా జ్ఞానోదయం అయ్యేనా?

యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది.

ఇన్నాళ్ల ఆయన సినీ కెరీర్ లో కేవలం 10 సినిమా లు మాత్రమే చేశాడు.

అందులో మూడు సినిమా లు బాలయ్య హీరో గా రూపొందించాడు.బాలయ్య, బోయపాటి కాంబోలో మొదటి సినిమా గా సింహా( Simha ) వచ్చింది.

ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ తర్వాత లెజెండ్‌ సినిమా( Legend movie ) వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక అఖండ సినిమా వచ్చి హ్యాట్రిక్ ను ఈ కాంబో దక్కించుకోవడం జరిగింది.కానీ ఇతర హీరో లతో ఈయన చేస్తున్న సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.

Advertisement

అల్లు అర్జున్ తో ఈయన రూపొందించిన సరైనోడు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత ఇప్పటి వరకు ఇతర హీరోలతో బోయపాటి సక్సెస్ ను దక్కించుకోవడం లో విఫలం అయ్యాడు.హీరోగా బాలయ్య ఉంటేనే బోయపాటి ఏం చేసినా నడుస్తుందని మరోసారి నిరూపితం అయింది.వినయ విధేయ రామ సినిమా ఫలితం మాదిరిగానే బోయపాటి తాజా చిత్రం స్కంద ఫలితం ఉంది.

స్కంద పై రామ్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు.శ్రీ లీల( Sri Leela ) హీరోయిన్ గా నటించడం తో పాటు చాలా వరకు పాజిటివ్ బజ్ క్రియేట్‌ అయింది.

అయినా కూడా ఫలితం లేకుండా పోయింది.అసలు ఇప్పటి వరకు స్కంద సినిమా ప్రేక్షకులను అలరించడం లేదు అంటే నమ్మలేక పోతున్నాం అంటూ చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

భారీ ఎత్తున సినిమా కు సంబంధించిన పబ్లిసిటీ నిర్వహించి అఖండ సినిమా ను మించి ఉంటుంది అన్నట్లుగా పబ్లిసిటీ చేయడం జరిగింది.కానీ ఫలితం తారు మారు అవ్వడం తో బాలయ్య తో చేసిన మాదిరిగా ఇతర హీరోలతో చేయబోతే బొక్క బోర్లా పడుతాం అంటూ ఇప్పటికే బోయపాటికి అర్థం అయి ఉండాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు