టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) గురించి మనందరికీ తెలిసిందే.మొదట కెరటం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌఖ్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, కొండపొలం లాంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.మొన్నటి వరకు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా మంచి అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇకపోతే ఈమె బాలీవుడ్ హీరో నిర్మాత జాకి భగ్నాని( Jackky Bhagnani )తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.ఇదే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ కొన్నిసార్లు అనేక రకాల పోస్టులు చేసింది రకుల్ ప్రీత్ సింగ్.ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ రహస్యంగా పెళ్లిచేసుకున్నారని అనేక రకాల వార్తలు వినిపించాయి.
తాజాగా వీటిపై రకుల్ స్పందించింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.
మేమిద్దరం రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని దాచాలని ఏరోజు అనుకోలేదు.

అలా చేయడానికి మేము చిన్నపిల్లలం కాదు కదా! ప్రేమ, పెళ్లి అనేవి అందరి జీవితాల్లో సహజంగా ఉండేవే.ఇందులో దాచడానికి ఏం ఉండదు.మేము మా ఇద్దరి విషయం అధికారికంగా ప్రకటించినప్పటికీ ఎన్నో రూమర్స్ వస్తున్నాయి.
కొన్ని మీడియాల్లో ఇప్పటికే రెండు సార్లు మా ఇద్దరికీ పెళ్లి చేసేశారు.గత డిసెంబర్లో మా పెళ్లి అయినట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
అప్పుడు మేము ఖండించడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మేము రహస్యంగా వివాహం చేసుకున్నామని రాశారు.కాబట్టి మేము నిజంగా పెళ్లి( Rakul Jackky Bhagnani Marriage ) చేసుకున్న రోజు వాళ్లకు కచ్చితంగా తెలుస్తుంది.
ఇప్పటి వరకు మాపై వచ్చిన ఇలాంటి వార్తలు చూసి చాలా నవ్వుకున్నాము.వాళ్లు చాలా నమ్మకంతో రాస్తారు.
ఇలాంటివన్నీ నేను సినిమా సెట్‌లో ఉన్నప్పుడు వస్తుంటాయి అని తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్
.






