టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.
మొన్నటి వరకు టాలీవుడ్( Tollywood ) లో వరుసగా అవకాశాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ.ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఏడాదిలోనే ఏకంగా ఐదు సినిమాలను రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది రకుల్ ప్రీత్ సింగ్.ఇక ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాని( Actor Jackie Bhagnani ) తో ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే.

ఇదే విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించింది.గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలలో బిజీ బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్ ( boy friend )తో కలిసి వెకేషన్ లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పటి నుంచి పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు రకుల్ ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ఇప్పటికే గతంలో చాలాసార్లు పెళ్లి విషయంపై స్పందించిన రకుల్ తాజాగా మరోసారి పెళ్లి విషయంపై స్పందించింది.

తాజాగా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ప్రియుడు జాకీ భగ్నాని అక్టోబర్లో మూడు ముళ్ళు బంధంతో ఒక్కటి కాబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అక్టోబర్లో ఈ జంట వారి ప్రేమకు సంబంధించిన విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.అయితే అదే నెలలోనే వారి పెళ్లి కూడా ఉంటుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
తాజాగా ఇదే విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.ఇంకా పెళ్లి గురించి ఏమీ అనుకోలేదు.
నేను పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో, మా అమ్మ నాన్నలు నన్ను అడగలేదు.మీడియా మాత్రం డేట్ ఫిక్స్ చేసేస్తోంది.
ఈ వార్తలను నేనెలా డీల్ చేస్తానో చూడాలని తాపత్రయపడుతున్నారు మా తల్లిదండ్రులు.నా లైఫ్‌ని నేనెలా డిజైన్ చేసుకుంటానో చూడాలన్నది వారి కోరిక.
భగ్నానితో ప్రేమ గురించి చెప్పినట్టే, ఈ రిలేషన్‌షిప్ నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్ గురించి కూడా నేను అందరితో పంచుకుంటాను అని కూల్ గా సమాధానం ఇచ్చింది రకుల్.







