రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న 'శశివదనే' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి.

 Rakshit Atluri Sashivadane Movie First Schedule Completed Details, Rakshit Atlur-TeluguStop.com

భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న చిత్రం ‘శశివదనే’.సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు.

సంగీత దర్శకుడు – నటుడు రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, ‘రంగస్థలం’ మహేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది.

త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ “ఇప్పటివరకూ 30 శాతం చిత్రీకరణ పూర్తయింది.

అందులో రెండు మాంటేజ్ సాంగ్స్ కూడా ఉన్నాయి.ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మీద ప్రేమ, వినోదాత్మక సన్నివేశాలు తీశాం.

త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో రఘు కుంచె గారు, శ్రీమాన్ గారు, ‘రంగస్థలం’ మహేష్ జాయిన్ అవుతారు.గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఈ ‘శశివదనే’.

లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి.యూనిక్‌గా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

దర్శకుడు, ఛాయాగ్రాహకుడు సినిమాను చాలా గ్రాండియ‌ర్‌గా, హై స్టాండ‌ర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారు.ఇప్పటివరకూ తీసిన సన్నివేశాలు చూశాం.

మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం.మ్యూజిక్, విజువల్స్ హైలైట్ అవుతాయి” అని అన్నారు.

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా… సంగీత దర్శకుడు – నటుడు రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు ప్రిన్స్ దీపక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: గ్యారీ బీహెచ్, కలరిస్ట్: ఎ.అరుణ్ కుమార్ (డెక్కన్ డ్రీమ్స్), సీఈవో: ఆశిష్ పెరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్, కాస్ట్యూమ్స్ – సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రచన – దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన.

Rakshit Atluri Sashivadane Movie First Schedule Completed Details, Rakshit Atluri, Sashivadane Movie, First Schedule Completed , Komali Prasad, Ahiteja Bellam Konda , Raghu Kunche, Tollywood, Rangasthalam Mahesh, Sashivadave Shoot Update - Telugu Ahitejabellam, Schedule, Komali Prasad, Raghu Kunche, Rakshit Atluri, Sashivadane, Sashivadave, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube