నాన్న మరణంపై అనుమానాలు.. రాకేష్ మాస్టర్ కూతురి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్( Tollywood ) ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రాకేష్ మాస్టర్( Rakesh master ) మరణం ఆయన ఫ్యాన్స్ ను ఎంతో బాధ పెట్టింది.రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా మరణించడంతో ఆయన మరణం విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 Rakesh Master Daughter Sensational Comments Goes Viral In Social Media Details H-TeluguStop.com

రాకేశ్ మాస్టర్ కూతురు మీడియాతో మాట్లాడుతూ తండ్రి మరణం గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.నాన్న చనిపోవడం వెనుక వేరే కారణాలు ఉండవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.

గతంలో ఆస్పత్రికి తీసుకెళితే నాన్న రెండు నెలల కంటే ఎక్కువగా బ్రతకరని చెప్పారని రాకేశ్ మాస్టర్ కూతురు అన్నారు.నాన్న మరణ వార్త తెలిసిన వెంటనే భయం వేసిందని నేను షాక్ కు గురయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.

ఫోన్ లో మాట్లాడిన సమయంలో నాన్న సాధారణంగానే మాట్లాడారని రాకేష్ మాస్టర్ కూతురు పేర్కొన్నారు.వైజాగ్( Vizag ) నుంచి వచ్చానని హెల్త్ బాలేదని నాన్న అన్నారని ఆమె తెలిపారు.

Telugu Rakesh Master-Movie

రెండు రోజుల్లో కాల్ చేస్తానంటూ 11 నిమిషాల పాటు నాన్న మాట్లాడారని ఆమె వెల్లడించడం గమనార్హం.వైద్యులు మాత్రం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ( Multiorgan failure )వల్ల రాకేష్ మాస్టర్ చనిపోయారని చెబుతున్నారు.రాకేష్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాకేష్ మాస్టర్ భౌతికంగా మరణించినా తమ హృదయాల్లో జీవించే ఉంటారని కొంతమంది చెబుతున్నారు.

Telugu Rakesh Master-Movie

రాకేష్ మాస్టర్ కుటుంబానికి ఆయన శిష్యులు అండగా ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతున్న సమయంలో ఆయన మృతి చెందారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాకేష్ మాస్టర్ బ్రతికున్న సమయంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు.శేఖర్ మాస్టర్ రాకేశ్ మాస్టర్ తో గొడవ గురించి స్పందిస్తూ రాకేశ్ మాస్టర్ బూతులు మాట్లాడటం వల్లే ఆయనకు దూరమయ్యానని చెప్పుకొచ్చారు.

రాకేశ్ మాస్టర్ శిష్యులు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube