రాజ్యసభలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం..!!

మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill ) కు గురువారం రాజ్యసభ( Rajya Sabha )లో కూడా ఆమోదం లభించింది.చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం తెచ్చిన ఈ బిల్లుకు రాజ్యసభలో గురువారం రాత్రి జరిగిన ఓటింగ్ లో 171 మంది అనుకూలంగా ఓట్లు వేయడం జరిగింది.

 Rajya Sabha Approves Women Reservation Bill , Rajya Sabha, Women Reservation Bil-TeluguStop.com

దాదాపు పది గంటలకు పైగా చర్చ సాగింది.రాజ్యసభలో ఏ ఒక్కరు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు.

లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో 456 మంది సభ్యులు ఉండగా… ఇద్దరు మినహా 454 మంది అనుకూలంగా ఓట్లు వేశారు.ఉభయ సభలలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ వర్తించనుంది.

రాజ్యసభలో డిజిటల్ డివైజ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరిగింది.దీంతో ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు.చివరిగా రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టంగా మారనుంది.అయితే ఈ బిల్లు 2024 ఎన్నికలలో వర్తింపు ఉండదని కేంద్ర పెద్దలు తెలియజేయడం జరిగింది.

ఉభయ సభల కొత్త  భవనంలో మొట్టమొదటిసారిగా “నారీ శక్తి వందన్ అధినియం( Nari Shakti Vandan Adhiniyam )” పేరిట తీసుకొచ్చిన ఈ చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించడం పట్ల దేశవ్యాప్తంగా మెజార్టీ పార్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube