రాజ్యసభలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం..!!

మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill ) కు గురువారం రాజ్యసభ( Rajya Sabha )లో కూడా ఆమోదం లభించింది.

చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం తెచ్చిన ఈ బిల్లుకు రాజ్యసభలో గురువారం రాత్రి జరిగిన ఓటింగ్ లో 171 మంది అనుకూలంగా ఓట్లు వేయడం జరిగింది.

దాదాపు పది గంటలకు పైగా చర్చ సాగింది.రాజ్యసభలో ఏ ఒక్కరు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు.

లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో 456 మంది సభ్యులు ఉండగా.ఇద్దరు మినహా 454 మంది అనుకూలంగా ఓట్లు వేశారు.

ఉభయ సభలలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ వర్తించనుంది.

రాజ్యసభలో డిజిటల్ డివైజ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరిగింది.దీంతో ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు.

చివరిగా రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టంగా మారనుంది.అయితే ఈ బిల్లు 2024 ఎన్నికలలో వర్తింపు ఉండదని కేంద్ర పెద్దలు తెలియజేయడం జరిగింది.

ఉభయ సభల కొత్త  భవనంలో మొట్టమొదటిసారిగా "నారీ శక్తి వందన్ అధినియం( Nari Shakti Vandan Adhiniyam )" పేరిట తీసుకొచ్చిన ఈ చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించడం పట్ల దేశవ్యాప్తంగా మెజార్టీ పార్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

హెయిర్ బ్రేకేజ్ తో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టండి!