రాజుగారి గది-3 ఫస్ట్ లుక్ వచ్చేసింది,అదరగొట్టిన అవికా

టీవీ ప్రెజెంటర్ గా సక్సెస్ ఫుల్ గా క్లిక్ అయిన ఓంకార్, ఆ తరువాత దర్శకుడి గా మారిన విషయం తెలిసిందే.

ఆయన దర్శకత్వంలో వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ "రాజుగారి గది".

చిన్న యాక్టర్స్ ని పెట్టి చేసిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.ఆ ఒక్క చిత్రంతో ఓంకార్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఈ క్రమంలో రాజుగారి గది-2 కి మాత్రం స్టార్ యాక్టర్స్ అయిన నాగార్జున,సమంత లను పెట్టి తీశాడు.అయితే ఆ చిత్రం కూడా కాస్త పర్వాలేదు అని అనిపించుకుంది.

ఇప్పుడు దానికి సీక్వెల్ గా రాజుగారి గది-3 చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రం లో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ నటి అవికా గోర్ నటిస్తుంది.

Advertisement

ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ వినాయక చవితి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేయగా ఆ పోస్టర్ లుక్ చాలా భయంకరంగా ఉంది.అవికా గోర్ ఆ పోస్టర్ లో దెయ్యం గా భలే అదరగొట్టింది.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బాగా ఫెమస్ ఐన అవికా కు ఆ తరువాత వెండితెరపై అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

ఈ క్రమంలో ఉయ్యాలా జంపాలా చిత్రంతో వెండితెరకు పరిచయం కాగా,ఆ తరువాత సినిమా చూపిస్తా మామా,ఎక్కడకి పోతావు చిన్నవాడా చిత్రాలతో బాగానే ప్రేక్షకులను అలరించింది.అయితే ఈ చిత్రాల తరువాత టాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చిన అవికా హిందీ సీరియల్స్ తో బిజీ గా మారింది.

అయితే చాలా రోజుల గ్యాప్ తరువాత మళ్లీ ఈ రాజుగారి గది-3 చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరి ఈ చిత్రం ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో అనేది తెలియాలి అంటే ఈ చిత్రం రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.ఈ చిత్రంలో అశ్విన్ బాబు హీరోగా నటిస్తుండగా, త‌మ‌న్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఊర్వశి, హ‌రితేజ‌, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, అజ‌య్‌ ఘోష్ లు ఇత‌ర పాత్రల్లో న‌టిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు