మేకిన్ ఇండియాకు సాయపడండి.. యూఎస్ డిఫెన్స్ కంపెనీలతో రాజ్‌నాథ్ సింగ్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Minister Rajnath Singh )శుక్రవారం (స్థానిక కాలమానం ప్రకారం) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో యూఎస్ డిఫెన్స్ కంపెనీల ( US defense companies in Washington DC )సీనియర్ మేనేజ్‌మెంట్‌తో భేటీ అయ్యారు.

భారతదేశంలో రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను ఆయన వివరించారు.

యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (యూఎస్ఐఎస్‌పీఎఫ్) నిర్వహించిన రౌండ్ టేబుల్ సందర్భంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను సాధించే దిశగా మేకిన్ ఇండియా ( Makein India )కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి భారత భాగస్వాములతో కలిసి పనిచేయాలని రాజ్‌నాథ్ సింగ్ కంపెనీలను ఆహ్వానిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.భాగస్వామ్యం, జాయింట్ ఎఫర్ట్స్ అనే రెండు పదాలు ఇతర దేశాలతో భారత రక్షణ పరిశ్రమ భాగస్వామ్యాన్ని వేరుచేస్తాయని రాజ్‌నాథ్ హైలైట్ చేశారు.

భారత ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల సంస్కరణలు అమెరికా సహా అనేక విదేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ ( Foreign Original Equipment )తయారీదారులను ఇండియాలో తయారీ యూనిట్లను స్థాపించడానికి, జాయింట్ వెంచర్‌ను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించాయని రక్షణ శాఖ తెలిపింది.

భారత్‌ను వారి ప్రత్యామ్నాయ ఎగుమతి స్థావరంగా మార్చడానికి ఇండియాలో జీఈ 414 ఏరో ఇంజిన్‌ల ఉత్పత్తి .ఇండో - యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొంది.ప్రముఖ అమెరికన్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీలైన బోయింగ్, జీఈ, జనరల్ అటామిక్స్, జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్, ఎల్ 3 హారిస్, లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్ టెక్నాలజీస్, రోల్స్ రాయిస్, థామర్‌మహన్ వంటి సంస్థల ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్‌‌కు హాజరైనట్లుగా రక్షణ శాఖ తెలిపింది.

Advertisement

ఐడియాఫోర్జ్, టాటా సన్స్, సెకండ్ వంటి భారతీయ కంపెనీలు, కోహెన్‌ గ్రూప్‌కు చెందిన సీనియర్ లీడర్స్ రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన ఇంటరాక్షన్‌కు హాజరయ్యారని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ సందర్భంగా బిజినెస్ లీడర్స్ ఇండియా కోసం తమ కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు, ప్రణాళికలను క్లుప్తంగా వివరించారు.

చిరు నాగ్ వెంకీలలో బాలయ్యకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు