హైదారాబాదులో కొత్త సచివాలయ భవనం అద్భుతంగా నిర్మిస్తామని ఎప్పటినుంచో చెబుతున్న సీఎం కెసీఆర్ అందుకు తొలి అడుగు వేశారు.కొత్తగా సచివాలయం మాత్రమే కాకుండా సీఎం క్యాంపు కార్యాలయం, ఐ ఏ యస్ అధికారులకు నివాసాలు కూడా కట్టిస్తున్నారు.
ఈ మూడు నిర్మాణాల కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించింది.దీనికి సంబంధించి జీఒ జారీ చేసింది.
ఆరుగురు సభ్యులున్న ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చైర్మనుగా వ్యవహరిస్తారు.







