సాకారమవుతున్న రోహిత్ కల

రోహిత్ వేముల ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటిలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి.

 Rohith Vemula Dream Comes True-TeluguStop.com

ఇతని ఆత్మహత్య దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం కలిగించిందో తెలిసిందే.ఇక అసలు విషయం ఏమిటంటే… ఆర్థికంగా వెనుకబడి ఉన్న రోహిత్ కుటుంబానికి సొంత ఇల్లు (పక్కా ఇల్లు) సమకూరబోతున్నది.

ఇది ప్రభుత్వం కట్టిస్తున్న ఇల్లు కాదు.

ఈ కుటుంబానికి ఇప్పటివరకు చిన్న రేకుల గది మాత్రమే ఉంది.

సొంత ఇల్లు నిర్మించాలన్న రోహిత్ ఆ పని చేయకుండానే వెళ్ళిపోయాడు.దీంతో అతని కల నెరవేర్చడానికి కొందరు ముందుకు వచ్చారు.

గుంటూరుకు దగ్గరలోని కొప్పురావూరు గ్రామంలో 20 లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆలిండియా ముస్లీం లీగ్ కమిటీ సభ్యులు ముందుకు వచ్చారు.ఇందుకు అవసరమైన 160 గజాల జాగాను ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఏపీ ఐ ఏ యస్, ఐ పీ ఎస్ అధికారుల సంఘం సభ్యులు.

సొంత ఇల్లు కట్టిస్తానని రోహిత్ ఎప్పుడూ చెప్పేవాడని, కానీ ఆ కల తీరకుండానే అతను ప్రాణాలు వదిలాడని రోహిత్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.ఇప్పుడు పెద్ద మనసుతో ఇల్లు కట్టిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube