'జైలర్'లో అలా కనిపించబోతున్న సూపర్ స్టార్!

సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు.ఈయనను ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

రజనీకాంత్ కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ ఇండియన్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్స్ చేత సూపర్ స్టార్ గా మన్ననలు పొందుతున్నాడు.రజనీకాంత్ సినిమాల కోసం ఒకప్పుడు థియేటర్స్ దగ్గర నానా హంగామా చేసేవారు.

కానీ మారుతున్న ప్రేక్షకుల అభిరుచి కారణంగా ఈ మధ్య రజనీకాంత్ చేస్తున్న సినిమాలు అంతగా హిట్ అందుకోలేక పోతున్నాయి.అయితే ఇప్పటికీ రజనీకాంత్ మంచి కంటెంట్ తో వస్తే హిట్ అందుకోవడం ఖాయం.

ఈ క్రమంలోనే రజనీకాంత్ ఈసారి జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.ఎప్పటిలా కాకుండా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాల్లో ఇంత హైప్ ఏర్పరుచుకున్న సినిమా ఇదే కావడం విశేషం.కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మేకర్స్ వరుస అప్డేట్ లను అందిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఇప్పటికే ఈ సినిమా ఒక రాత్రిలోనే నడిచే కథ అని హింట్ వచ్చింది.ఇక ఇప్పుడు రజనీకాంత్ పాత్రపై మరో అప్డేట్ బయటకు వచ్చింది.రజనీ కాంత్ రోల్ జైలులో వర్క్ చేస్తున్న జైలర్ లా కాకుండా.

ఒక రిటైర్డ్ జైలర్ గా కనిపించ నున్నారట.ఈ సినిమాలో ఈయన పాత్ర ఇలానే ఉండనుందట.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఇదిలా ఉండగా ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Advertisement

అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు